ఇద్దరూ ఒకే రకం పాత్రలు: అనుష్క లేదా నయనతార ఎవరొస్తారో??

కర్తవ్యంలో నయన తారా, ఇటు తెలుగులో భాగమతి లో అనుష్క , కొద్దిపాటి తేడాతో ఐఏఎస్ ఆఫీసర్స్‌గా నటిస్తోన్న ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా మెప్పిస్తారో చూడాలి.

భాగమతి అనౌన్స్ అయినప్పుడు మరీ ఇంత బజ్జ్ అయితే లేదు. కేవలం అనుష్క హీరోయిన్ కావటం, హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అన్న విషయం బయటకి రావటం తో కాస్త ఆసక్తిగా చూసారంతా... అయితే మొన్న వచ్చిన ఫస్ట్ లిక్ తో ఒక్కసారి అందరి కళ్ళూ ఇటే చూసాయి.

అనుష్క పోషిస్తోన్న మరో క్యారెక్టర్

అనుష్క పోషిస్తోన్న మరో క్యారెక్టర్

ఫస్ట్‌లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసింది అనుష్క సినిమా 'భాగమతి'. అయితే ఈ సినిమాలో అనుష్క పోషిస్తోన్న మరో క్యారెక్టర్ ఇంకాస్త అద్భుతంగా ఉంటుందట. ఇదిలా ఉంటే ఈ క్యారెక్టర్ విషయంలో అనుష్కతో పోటీ పడుతోందట నయనతార. ఈ సినిమాలో కాదులేండి..

యూవీ క్రియేషన్స్

యూవీ క్రియేషన్స్

అనుష్క కథానాయికగా రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్ సినిమా 'భాగమతి'. యూవీ క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.

 అనుష్క డ్యుయల్ రోల్‌

అనుష్క డ్యుయల్ రోల్‌

ఒక చేతికి గాయం మరో చేతిలో ఆయుధంతో కనిపించిన అనుష్క లుక్ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచింది. అయితే ఈ సినిమాలో మరో స్పెషల్ ఎలిమెంట్ కూడా ఉందట. ఈ చిత్రంలో అనుష్క డ్యుయల్ రోల్‌లో నటిస్తోంది. అందులో ఒక పాత్రలో ఐఏఎస్ అధికారిణిగా కనిపించబోతోందట ఈ అందాల జేజేమ్మ.

ఐఏఎస్ అధికారిణి పాత్రలో అనుష్క

ఐఏఎస్ అధికారిణి పాత్రలో అనుష్క

ఐఏఎస్ అధికారిణి పాత్రలో అనుష్క యాక్టింగ్ అదుర్స్ అనిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. 'అరుందతి' తరహా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించిన అనుష్క.. 'భాగమతి' పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి.

నయనతార కలెక్టర్‌గా

నయనతార కలెక్టర్‌గా

ఇదిలా ఉంటే 'ఆరమ్' అనే తమిళ చిత్రంతో నయనతార కలెక్టర్‌గా నటిస్తోంది. ఈ నెల 10న ఈ సినిమా తమిళంలో విడుదల కానుండగా త్వరలోనే 'కర్తవ్యం' పేరుతో తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఇక అనుష్క చిత్రం 'భాగమతి' సంక్రాంతికి వస్తోంది.

అనుష్క కన్నా నయనతారకే

అనుష్క కన్నా నయనతారకే

మరి కొద్దిపాటి తేడాతో ఐఏఎస్ ఆఫీసర్స్‌గా నటిస్తోన్న ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా మెప్పిస్తారో చూడాలి. అయితే ఒకరకంగా అనుష్క కన్నా నయనతారకి తమిలనాడులో ఉన్న స్కోప్ ఎక్కువ, అదే ఇక్కడ అయితే అనుష్క తో పోటీపడేంత సీన్ అయితే ఇక్కడ లేనట్టే మరి చూద్దాం అనుష్క నో నయన తారనో....

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X