అనుష్క ‘పంచాక్షరి’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే...
అనుష్క ప్రధాన పాత్రలో వి.సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న 'పంచాక్షరి" చిత్రం జూన్ 4న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ చంద్ర(బొమ్మదేవర రామచంద్రరావు) శ్రీ రత్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క ద్విపాత్రలలో కనిపించే ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సామ్రాట్ అనే కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అలాగే అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వేదంలోనూ, మహేష్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలోనూ, పవన్ కళ్యాణ్ తాజాగా చేస్తున్న లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ లోనూ చేస్తోంది. ఇక దర్శకుడు సముద్ర ఈ చిత్రానికి ముందు జగపతి బాబుతో అధినేత చిత్రం చేసారు. అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
పంచాక్షరి అనుష్క సముద్ర నాగార్జున తకిట తకిట అరుంధతి anushka samudra nagarjuna takita takita king arundhati


Click it and Unblock the Notifications