twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'నాన్న’పై ఎక్కువ ఆశలు పెంచుకొన్న అనుష్క..!?

    By Sindhu
    |

    అపజయాలు, ఆదాయపన్ను దాడులతో అస్తవ్యస్తంగా తయారైన అనుష్క కెరీయర్ కు అతిగతి అన్నీ 'నాన్న" చిత్రమే. హీరోయిన్ గా ఇంకా మిగిలే వుందా అంటే కేవలం నామమాత్రంగా వున్నాను అనిపించుకొనే స్థాయికి జారిపోయిన అనుష్కకు చేదోడు వాదోడుగా వున్నాడు హీరో విక్రమ్. వీరిద్దరి కలయికలో రూపుదిద్దుకున్న అరవ చిత్రం 'దైవ తిరుమగళ్"కు తెలుగు వర్షన్ గా వస్తోంది 'నాన్న" చిత్రం.

    అపరిచితుడు" తదుపరి సరైన విజయం లేని విక్రమ్ కి కూడా ఈ ప్రాజెక్ట్ కీలకమైనదే. మానసిక వికలాంగుడిగా విక్రమ్ నటన హైలైట్ కానున్న ఈ సినిమాలో అతని హక్కుల కోసం పోరాడే న్యాయవాదిగా, అనుష్క పాత్ర పూర్తిగా నటనకు ఆస్కారం వున్నది కావటంతో 'అరుంధతి" తరువాత అంతటి అద్భుత అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇందులో అనుష్క మధ్యతరగతికి చెందిన అనూరాధా రఘునాథన్ అనే తమిళ బ్రాహ్మణ యువతిగా నటించింది. సహజత్వం కోసం ఈ పాత్ర పోషణలో అతి తక్కువ మేకప్ తో నటించిందట. అలాగే, ఈ పాత్ర చేస్తున్నప్పుడు తనకు తెలియకుండానే అందులో లీనమైపోయేదట. 'నేనే కాదు... ఆర్టిస్టులంతా అంతే. షూటింగులో మా అసలు పేర్లతో కాకుండా ఆయా పాత్రల పేర్లతోనే పిలుచుకునే వాళ్లం. అంతలా ఈ సినిమాని ఇష్టపడ్దాం, షూటింగ్ ని ఎంజాయ్ చేశాం" అంటోంది అనుష్క. మరి ఎన్నో ఆశల నడుమ రానున్న'నాన్న" వీరిద్దరినీ ఎలా ఆదుకుంటాడో వెయిట్ అండ్ సీ..

    English summary
    Anushka plays the role of a lawyer whereas Vikram play the retard in it. This film is about a mentally retarded father fighting for the rights of upbringing his child.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X