రాజమౌళి చిత్రంలో అనుష్క ఖరారు
హైదరాబాద్ : ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రం ఓ పీరియడ్ డ్రామా గా నడవనుంది. గతంలో అనూష్క...రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన 'విక్రమార్కుడు'లో నటించింది.
అనూష్క వరస చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి అడిగిన వెంటనే డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సినిమాకి సైన్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి చిత్రం కోసం ఆమె బల్క్ గా డేట్స్ కేటాయించనున్నారు. దాంతో ఆమె ఈ చిత్రం పూర్తయ్యే దాకా దాదాపు వేరే సినిమాలు కమిటయ్యే అవకాసం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేయాలి. గుణశేఖర్ దర్శకత్వంలో చేస్తున్న రుద్రమదేవి చిత్రం కోసం కూడా ఆమె ఎక్కువ రోజులు డేట్స్ ఇస్తున్నారు.
ఇక ఈ చిత్రంలోని ప్రభాస్ క్యారెక్టర్ చాలా విభిన్నంగా రాజమౌళి తీర్చి దిద్దాడని చిత్ర పరిశ్రమలో వినపడుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన ప్రత్యేకమైన వ్యాయామాలతో బాడీని కూడా మార్చుకొంటున్నట్లు తెలిసింది. ఈ చిత్ర కథలో కొంత మేరకు గతకాల విషయాల ప్రస్తావన ఉంటుందని అంటున్నారు.
అలాగే అనూష్క,ప్రభాస్ లు కలిసి చేసే మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'బిల్లా'లోనూ, రాబోయే 'మిర్చి'లోనూ ప్రభాస్ సరసన అనుష్క నటించింది. రాజమౌళి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. విలన్ పాత్రకు రానా దగ్గుబాటి పేరు పరిశీలనలో ఉంది.


Click it and Unblock the Notifications











