అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్: 'అరుంధతి' లో జేజమ్మగా అదరగొట్టి భాక్సాఫీస్ రికార్డులు బ్రద్దలు కొట్టిన అనుష్క త్వరలో రాణి రుద్రమ దేవి కనిపించనన్న సంగతి తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ రాణి రుద్రమ దేవి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా హీరోయిన్లను పరిశీలించిన తర్వాత అనుష్కను ఖరారు చేసారు. ఈ చిత్రానికి సంభందించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది.

ఈ చిత్రాన్ని 3డి టెక్నాలజీతో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వరుస ప్లాపులతో ఉన్న గుణశేఖర్ తో సినిమా చేయడానికి నిర్మాతలు ఎవరూ ముందకు రావక పోవడంతో తానే స్వయంగా ఈచిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నాడు గుణశేఖర్. గుణ టీం వర్క్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇళయరాజా సంగీతం అందించనున్నారు.

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

గుణశేఖర్ మాట్లాడుతూ...ఈచిత్రం భారత దేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి సినిమా అని, ఇందుకోసం కాకతీయుల కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక సెట్ వేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈచిత్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

'ఇంత వరకూ నేను పాఠ్య పుస్తకాల్లోనే రుద్రమ దేవి గురించి చదివా. ఇప్పుడు ఆమె పాత్రని నేనే వేస్తున్నా అని తలచుకుంటే చాలా ఆనందంగా ఉంది. చరిత్రని గుర్తు చేసే పాత్రల్లో చేయడం నిజంగా అదృష్టమే' అంటోంది అనుష్క.

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

'కాకతీయుల చరిత్ర, 'రుద్రమ దేవి' కథ, పాత్రల గురించి దర్శకుడు గుణశేఖర్‌ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఆయన స్క్రిప్ట్‌ మొత్తం చూపించారు. ఆ పాత్ర కోసం నేను నెలన్నర రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను'' అని అనూష్క

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

వరంగల్‌ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

అరుంధతి సినిమా మూలంగా - అనుష్క హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు న్యాయం చేయగలదనే నమ్మకం దర్శకుల్లో కలిగింది. ఆ నమ్మకమే ఓ గౌరవం అని భావిస్తుంటాను. ఇప్పుడు రుద్రమదేవి రూపంలో ఓ మంచి చిత్రం దక్కింది. మరోసారి నటిగా నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఎంచుకొన్న ప్రతి చిత్రం నా మనసుకి నచ్చిందే అనుకొంటాను అంది అనూష్క.

అనూష్క ‘రుద్రమ దేవి’వర్కింగ్ స్టిల్స్ (ఫోటోలు)

గుణశేఖర్‌ మాట్లాడుతూ ''వరంగల్‌లోని చారిత్రక కట్టడాల గురించి చరిత్రకారులతో ప్రత్యేకంగా మాట్లాడాను. అవన్నీ మా పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలకు తగినట్టుగా సెట్స్‌ నిర్మిస్తున్నాం. కళాదర్శకుడు తోట తరణి.. ఇందుకు సంబంధించిన స్కెచ్‌లు వేస్తున్నారు''అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్.

ఈ చిత్ర స్క్రిప్ట్ కోసం దాదాపు పదేళ్లుగా గుణశేఖర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. సాంకేతికంగా అత్యున్నతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 12వ శతాబ్ధంలోని కాకతీయ సామ్రాజ్యం నేపథ్యంలో చారిత్రాత్మక చిత్రంగా దీన్ని దర్శకుడు గుణశేఖర్ రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో 'రుద్రమదేవి'గా అనుష్క టైటిల్ పాత్ర చేయనుంది. చిత్రం వర్కింగ్ స్టిల్స్ మీ కోసం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X