గాసిప్స్ కి సిద్దమైతేనే సినిమాల్లోకి రండి: అనుష్క
ఔత్సాహిక తారామణులకు నేనిచ్చే సలహా ఒక్కటే. గాసిప్పులను ఫేస్ చేసే ఆత్మస్థైర్యం ఉంటేనే ఈ రంగంలోకి రండి' అంటున్నారు బాలీవుడ్ భామ అనుష్కశర్మ. తనపై వస్తున్న గాసిప్పులపై స్పందిస్తూ అనుష్క పై విధంగా స్పందించారు. 'రబ్ నే బనాది జోడీ' టైమ్ లో ఎవరెవరితోనో లింకులు పెడుతూ నాపై గాసిప్పులు వస్తుంటే... చూసి భయపడిపోయాను. నాకు సినిమాలు సెట్ కావేమో..అని అసహనానికి లోనయ్యాను.
కానీ గ్లామర్ ప్రపంచంలో ఇవన్నీ తప్పవని పోను పోనూ అర్థమైంది. ఇప్పుడు వాటిని మస్తుగా ఎంజాయ్ చేస్తున్నాను. పైగా ఫ్రీ పబ్లిసిటీ కూడానూ. ముఖ్యంగా ఎఫైర్స్ పేరుతో నాపై వస్తున్న గాసిప్పులను భలేగా ఎంజాయ్ చేస్తా. పైగా ఎవరితో నాకు లింక్ పెట్టారో... వారితోనే ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటా. అలా ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకుంటే వాటి గురించి బాధ పడాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం' అని చెప్పారు అనుష్క.
ఇంకా చెబుతూ -'గాసిప్పులు సృష్టించేవారికి కాస్తంత నైతిక విలువలు అవసరం. ఎదుటివారు హర్ట్ అవ్వనంత వరకూ ఎలా రాసినా ఫర్లేదు. కానీ అవి శృతిమించి రాగానపడకూడదు. అలా అభ్యంతరకరంగా అనిపిస్తే మాత్రం క్షమించను' అని నిక్కచ్చిగా చెప్పారు అనుష్క.


Click it and Unblock the Notifications












