కొద్ది రోజులుగా అనూష్క షూటింగులకు దూరంగా ఉంటోంది. కారణం తన ప్రమేయం లేకుండా తన సమక్షంలో జరిగిన ప్రమాదం. మార్చి 16 న తూర్పు గోదావరి జిల్లా అంగలూరులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రవితేజా, అనుష్కా కాంబినేషన్ లో రూపొందిస్తున్నసినిమా షూటింగ్ లో రవితేజ డూప్ ని సీన్ డిమాండ్ ప్రకారం అనూష్క నీళ్ళలోకి తోస్తే మునిగి చనిపోయాడు. అనుకోకుండా జరిగిన సంఘటన అనూష్కను బాగా కలిచివేయటంతో డిప్రెసెడ్ గా ఉండి సినీ ప్రపంచానికి దూరంగా ఉంటోంది. ఎవరెంత ఓదార్చినా ఆమె దీని నుండి కోలుకోలేక పోయింది. తన కళ్ళెదురుగా ఒక మనిషి మునిగి చనిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్ధితిలో చూస్తూడటం ఎవరికైనా తట్టుకోలేని విషయమే. కాలం ఎంతటి గాయాన్నైనా మానుస్తుంది అనే సినీ డైలాగు నిరూపిస్తూ ఇప్పుడు ఆమె మెల్లిగా కోలుకుని తిరిగి తన షెడ్యూల్స్ కి అటెండవటానికి ప్రిపేరవుతోంది. దాంతో ఆమె నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటున్నారు.