టాప్ హీరో సినిమాను రిజక్ట్ చేసిన అనుష్క
సెక్సీ లేడీ అనుష్క తమిళ టాప్ స్టార్లలో ఒకరైన అజిత్ సినిమాను రిజక్ట్ చేయడం ఇప్పుడు చెన్నయ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. గతంలో అజిత్ తో బిల్లా లాంటి భారీ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అనుష్క అయితే అజిత్ సరసన సరిగ్గా సెట్ అవుతుందని భావించిన విష్ణు ఆమెను సంప్రదించగా వీలు కాదని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది.
అనుష్క అజిత్ మూవీ రిజక్ట్ చేయడానికి కారణం బిజీ షెడ్యూలే. అనుష్క ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. నాగార్జునతో ఢమరుకం, ప్రభాస్ తో వారధి సినిమాల్లో బుక్కయింది. అయితే తమిళంలో మాత్రం మహా బిజీగా ఉంది. నాలుగు పెద్ద సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం ఆరు సినిమాలతో బిజీ షెడ్యూల్ తో గడుపుతోంది అమ్మడు.
బిజీషెడ్యూల్ కారణంగా అనుష్క తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరూ తప్పు పట్టకపోయినప్పటికీ.... ఓ పెద్ద స్టార్ సరసన అవకాశాన్ని జార్చుకోవడం ఆమెకు మైనస్సే అంటున్నారంతా.


Click it and Unblock the Notifications











