ఔను... ఈ మార్పుకి కారణం ‘అరుంధతి’: అనుష్క
ఔను. ఈ మార్పుకి కారణం 'అరుంధతి". అలాగే 'వేదం"కూడా హెల్ప్ అయ్యింది. హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ చేయడం అవసరం కానీ ఆ తరహా పాత్రలకే పరిమితమైతే మనుగడ ఉండదు. ఐదారేళ్లల్లో తెరమరుగయ్యే ప్రమాదం ఉంది అంటూ చెప్పుకొచ్చింది అనూష్క. ఆమె తన తాజా చిత్రం నాన్న ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడయాతో మాట్లాడుతూంటే.. కెరీర్ ఆరంభించినప్పటికన్నా ఇప్పుడు నటనకు అవకాశం ఉన్న పాత్రలు వస్తున్నాయి కదా? అని అనుష్కను అడిగితే ఇలా స్పందించింది.
అలాగే ఖలేజా లాంటి ఫెయిల్యూర్ చిత్రాలు గురించి ప్రస్దావిస్తూ.. ఎన్నో రోజులు కష్టపడి చేసిన సినిమా ఫెయిలైతే బాధగానే ఉంటుంది. ఎందుకిలా జరిగింది? అని కాసేపు ఆలోచించి వదిలేస్తాను. అలా వదలకపోతే తదుపరి సినిమాపై ఆ ప్రభావం పడుతుంది అంది. ప్రస్తుతం ఈ బెంగళూరు బ్యూటీ డమరుకం, రెబల్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె విక్రమ్ సరసన నటించిన 'నాన్న" త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











