నా కెరీర్ కి సంక్రాంతి మలుపు..అనూష్క
నా కెరీర్ ను సంక్రాంతి బొమ్మాళి ఎంతగా మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమైనా సంక్రాంతి నా జీవితంలో మధురజ్ఞాపకంలా నిలిచిపోయింది అంటోంది అనూష్క. 2009 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అరుంధతి' చిత్రం సూపర్ హిట్ అయిందో తెలిసిందే. దాని గురించే ఆమె చెపుతూ..ఇప్పటి వరకు నేను నటించిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే...సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన 'అరుంధతి' చిత్రం మరో ఎత్తు. ఆ చిత్రంతో నాకు లభించిన పేరు ప్రఖ్యాతులు నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. తెలుగు సినిమాకి అతిపెద్ద సీజన్ అయిన సంక్రాంతి పర్వదినాన ఈ చిత్రం విడుదలవ్వడం, ఓ అద్భుత విజయంగా ఆ చిత్రం సంచలనం సృష్టించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇప్పుడందరూ 'అరుంధతి'కి ముందు అనుష్క... 'అరుంధతి' తర్వాత అనుష్క...అని నా కెరీర్ ను విభజించి వర్ణిస్తున్నారు. దీనిని బట్టే నా కెరీర్ ను సంక్రాంతి బొమ్మాళి ఎంతగా మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమైనా సంక్రాంతి నా జీవితంలో మధురజ్ఞాపకంలా నిలిచిపోయింది. అలాగే సంక్రాంతిని ఇంగ్లీషులో 'పొంగల్' అంటాం. 'పొంగల్ వెరీ పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు' అంటూ చెప్తోంది అనుష్క. ఈ సంవత్సరం కూడా అరుంధతి లాంటి మరిన్ని హిట్స్ కొట్టాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











