ఆ సినిమా లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో?!...అనుష్క
"నాకొచ్చిన అవకాశాల వల్లే నేనీ స్థానంలో ఉన్నాను. 'సూపర్' అనే సినిమా లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్నో?! ఆ తర్వాత 'అరుంధతి', 'వేదం'...ఈ చిత్రాల్లో నటించే అవకాశం నాకు కాకుండా ఇంకో హీరోయిన్ కు దొరికినా వాళ్లకూ అంతే గుర్తింపు దక్కేది. అవకాశం ఇస్తేనే కదా ప్రతిభ ఏంటో తెలిసేది'' అంటోంది అనుష్క. అలాగే అవకాశం చాలా గొప్పది. అది రాకే చాలామంది స్టూడియో గుమ్మం దగ్గరే ఆగిపోతుంటారు. లేదంటే నాకన్నా ప్రతిభావంతులు ఎంతోమంది వెలుగులోకి వచ్చేవారు...అంటోందామె. ప్రస్తుతం మహేష్ సరసన అనుష్క నటించిన ఖలేజా త్వరలో రిలీజ్ కాబోతోంది. తమళ వేదం రీమేక్ లోనూ అనుష్క చేస్తున్నట్లు సమాచారం. వెంకటేష్ సరసన చంద్రముఖి చిత్రంలోనూ ఆమే లీడ్ రోల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











