»   » మన్మథుడి కోసం టబు స్థానాన్ని భర్తీ చేస్తున్న అనుష్క!

మన్మథుడి కోసం టబు స్థానాన్ని భర్తీ చేస్తున్న అనుష్క!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవ మన్మధుడుగా పేరు పొంది తెలుగు తారల మనస్సును దోచకుంటున్నా యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తను పరిచయం చేసిన అందాల అరుంధతితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడని సమాచారం. ఒక్క నాగార్జునకే కాదు. అతనంటే అనుష్క కూడా ఇష్ట పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ అనుమానాలు బలపడేట్లుగా నాగార్జున తీరుతో పాటు, అనుష్క తీరు కూడా పలు అనుమానాలను కలిగిస్తుంది.

సూపర్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనుష్క, ఆ తర్వాత నాగార్జునతో కలిసి ఫుల్ హీరోయిన్ గా డాన్, ఒక సాంగ్ లో కింగ్ లో చేసిన విషయం తెలిసిందే. మళ్లీ తాజాగా విడుదల అయినటువంటి కేడీ చిత్రంలో కూడా ఓ సాంగ్ కు నర్థించిన అనుష్క ఈ మద్య ఆ టైపు సాంగ్స్ చేయడం మనివేసిన విషయం తెలిసిందే. కానీ నాగార్జున సినిమా కోసం ఏ టైపు పాటలు చేయడానికైనా రెడీ అంటుంది. తాజాగా ఈ జంట మళ్లీ ఫుల్ పిక్చర్ చేయడానికి సిద్దం అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నాగార్జున సరసన అనుష్క నటిస్తుందని సమాచారం. చేతి నిండి సినిమాలు ఉన్నప్పటికీ నాగార్జునతో సినిమా అనగానే వెంటనే డేట్స్ ఇచ్చిన అనుష్క, నాగ్ మాయలో పడిందని అంటున్నారు విమర్శకులు..మరి టబు పరిస్థితి ఏమవుతుందో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu