దాసరి నారాయణరావు వ్యాఖ్యలకు ఘాటుగా రిప్లై ఇచ్చిన అనుష్క
ఓపెనింగులు, ఫంక్షన్లకు హీరోయిన్స్ ను పిలవవద్దని పరోక్షంగా అనుష్కను ఉద్దేశించి దాసరి చేసిన వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై అనుష్క మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చింది. ఆ అవార్డ్ ఫంక్షన్ కు నేను వెళ్ళకపోవటానకి కారణం నాకు ఆ అవార్డ్ ఫంక్షన్ గురించి నిజంగా తెలియకపోవటమే. అవార్డుల ఇన్విటేషన్ ఇంటికే మా కుక్ దాన్ని అందుకున్నాడు. నేను ఆ టైమ్ లో అవుటాఫ్ స్టేషన్.అందుకే వెళ్ళలేకపోయా.అంతేగాని అవార్డుల ఫంక్షన్ కి వెళ్లకూడదని కాదు. నాకు తెలిసి ఉంటే తప్పని సరిగా వెళ్ళేదాన్ని.
ఇక దాసరి రూపొందించదలచిన రామ సక్కని తల్లి సినిమాలో నటించనందనే విషయం ప్రస్దావనకు వచ్చినప్పుడు...అరుంధతి తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చాలానే వచ్చాయి. అయితే వాటిని నేను ఒప్పుకోలేదు. పంచాక్షరి స్క్రిప్టు నచ్చి చేసాను. అయితే మీరంటున్న డైరక్టర్ ఎవరూ నాకు ఏ ఆఫరూ చేయలేదు. అసలు అలాంటి సినిమా ఏదీ నా దృష్టికి రాలేదు అని తేల్చేసింది.అలాగే నటన విషయంలో నాకెలాంటి పరిమితులూ నిబంధనలూ లేవు. కథ నచ్చితే ఏ తరహా సినిమా చేయడానికైనా నేను సిద్ధం. ఒకప్పుడు విజయశాంతి పోషించిన యాక్షన్ సినిమాలు చేయడానికైనా నేను రెడీ. నాకు కథ ప్రధానం అంది.


Click it and Unblock the Notifications











