రాత్రి ఎనిమిది దాటితే అనుష్క ఆ పనికి దూరం
అనుష్క ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ స్టార్. అయితే ఆమె సౌందర్య రహస్యం యోగానే అనుకుంటారు. అయితే వాటితో పాటు తను పాటించే ఆహార నియమాలు కూడా అంటూ చెప్పుకొచ్చింది అనుష్క. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..."భోజనం విషయంలో నేనెప్పుడూ స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మితమైన ఆహారానికే ఎప్పుడూ నా ఓటు" అంది. అలాగే "ప్రతి రోజూ 30-40 నిమిషాలు కార్డియో చేస్తాను. నీళ్ళు ఎక్కువగా తాగుతాను. రాత్రిపూట ఎనిమిది దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయను. చర్మ సౌందర్యానికి క్లెన్స్, స్క్రబ్, మాయిశ్చరైజర్... ఈ మూడూ తప్పనిసరి. ఈ మూడింటి మీద దృష్టి పెడితే ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. తాజా చర్మం మీ సొంతమవుతుంది" అంటూ తన అసలు సీక్రెట్ ని వివరించింది. మరి కొద్ది రోజుల్లో ఆమె నటించిన ఖలేజా చిత్రం విడుదల కానుంది. ఆమె ప్రస్తుతం నాగార్జున సరసన వీరూపోట్ల దర్శకత్వంలో చేస్తోంది. అలాగే వేదం తమిళ రీమేక్ లోనూ ఆమె చేస్తోంది.


Click it and Unblock the Notifications











