Just In
- 24 min ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 1 hr ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
- 1 hr ago
‘మాస్టర్’ డైరెక్టర్‌తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 1 hr ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
Don't Miss!
- Sports
100వ టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన రికార్డ్ నెలకొల్పిన లైయన్.. రోహిత్ శర్మ బలి!!
- News
అందుకే తొలి టీకా వేయించుకున్నా..: కిష్టమ్మ, ప్రధాని చెప్పారనే టీకా వేసుకోలేదన్న కేటీఆర్
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Finance
మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సొరంగంలో అనుష్క పై సీన్స్
గుణశేఖర్ మాట్లాడుతూ ''మూడో షెడ్యూల్‌ను ఇటీవల ప్రారంభించాం. కాకతీయ సామ్రాజ్య వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాదర్శకుడు తోటతరణి సెట్స్‌ని తీర్చిదిద్దారు. పాకనాడు ప్రాంతం, సొరంగ మార్గం, దివిసీమ సెట్‌లను సహజత్వం ఉట్టి పడేలా రూపొందించారు. ప్రధాన తారాగణంపై వీటిలో సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. ''అన్నారు. అలాగే ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తిచేశామని, ఈనెల 17 వరకు షూటింగ్ ఉంటుందని తెలిపారు.
కాకతీయ సామ్రాజ్యం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాలలో విస్తరించి ఉన్నందువల్ల 13వ శతాబ్దపు కాకతీయ సామ్రాజ్యంలోని పాకనాడు ప్రాంతం సెట్‌ను తోట తరణి తీర్చిదిద్దారని, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, ఓరుగల్లు కోట నుండి వెయ్యి స్థంభాల గుడివరకు అప్పట్లో ఉన్న సొరంగ మార్గాన్ని కూడా సెట్ వేశామని, అక్టోబర్ 1నుండి నాలుగో షెడ్యూల్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటివరకు నిర్మించిన సన్నివేశాలు, పాటలు అద్భుతంగా వచ్చాయని, భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఈ చిత్రం చిరస్థాయిగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు.
నాటి కాకతీయ చరిత్రకు దర్పణంలా ఈ చిత్రం ఉంటుంది. అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా తోట తరణి అద్భుతమైన సెట్‌లు నిర్మిస్తున్నారు. ఓ వైపు సెట్స్ నిర్మాణం జరుగుతుంటే, మరో వైపు ఈ నెల 2 నుంచి షూటింగ్‌ని కూడా కానిచ్చేస్తున్నాం. ఈ భారీ సెట్‌లో భాగ మైన కాకతీయ సామ్రాజ్యంలోని పాకనాడు(ఇప్పటి ప్రకాశం జిల్లా) సెట్‌లో రుద్రమదేవి అనుష్క, నిడవర్ధ్యప్రోలు (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడు రానాలపై కీలక సన్నివేశాలు తీస్తాం.
వీటితో పాటు అజయ్, రవిప్రకాష్, శివాజీరాజా, కాదంబరి కిరణ్, పాకనాడు గ్రామ ప్రజలుగా నటిస్తున్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరిస్తాం. అలాగే... ఓరుగల్లు కోట నుంచి వెయ్యి స్థంభాల గుడి వరకూ అప్పట్లో ఓ సొరంగం ఉండేది. ఆ సెట్‌ని అబ్బురపరిచేలా వేశారు తోట తరణి. ఆ సెట్‌లో అనుష్క, నాగదేవుడిగా నటిస్తున్న బాబా సెహగల్‌పై కొన్ని సన్నివేశాలు తీస్తాం. ఈ భారీ సెట్‌లో మరో భాగం దివిసీమ ప్రాంతం సెట్. ఈ సెట్‌లో చిన్నారి రుద్రమగా నటిస్తున్న హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ, శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఈ చిత్రానికి సంగీతం: మేస్ట్రో ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్‌విన్సెంట్, కాస్ట్యూమ్స్: నీతాలుల్లా, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల, కథ, స్క్రీన్‌ప్లే,నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.