‘రుద్రమదేవి’ లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రానికి సంబంధించి నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నాలుగో షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో జరుగుతుంది.

దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ- ప్రస్తుతం అనుష్కపై అంతఃపురంలో అందాల చిలక అనే పాటను భారీ సెట్‌లో షూటింగ్ చేస్తున్నామని, ఈ షూటింగ్‌లో జారాషా, నథాలియా కౌర్‌లు కూడా పాల్గొంటున్నారని, ఈ నెల 20 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో 50 శాతం షూటింగ్ పూర్తవుతుందని ఆయన తెలిపారు. దాదాపు 800 ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ కాకతీయ కట్టడాలను పద్మశ్రీ తోట తరణి అద్భుతంగా సెట్లల్లో ఆవిష్కరించారని, ఇవి చూసిన ఆర్కియాలజిస్టులు ప్రసంశిస్తున్నారని ఆయన వివరించారు.

హీరో శ్రీకాంత్ పిల్లలు రోషన్, 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్నప్పటి రాణాగా నటిస్తున్నారని, అలాగే కూతురు మేథ తొమ్మిదేళ్ల ప్రాయంలో వున్న రుద్రమదేవిగా నటిస్తున్నారని, ప్రస్తుతం వీరిద్దరికి గుర్రపు స్వారీ, కత్తియుద్ధాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 'రుద్రమదేవి'కోసం భారీ సెట్...డిటేల్స్ అనుష్క ప్ భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X