For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' షూటింగ్ ఈ రోజు మొదలైంది

    By Srikanya
    |

    వరంగల్లు : అనుష్క ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'రుద్రమదేవి'. కాకతీయుల చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకొనే చిత్రమిది. స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో రూపొందబోతోంది. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇళయరాజా స్వరకర్త. ఈ చిత్రం షూటింగ్ ఈ రోజు(గురువారం)వరంగల్లు...వేయిస్ధంబాల గుడిలో ప్రారంభమైంది. రానా,అనూష్కలు ఈ ప్రారంభానికి హాజరయ్యారు. గుణశేఖర్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఒకేసారి తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతోంది.

    ఈ సినిమా కోసం ఇప్పటికే అనుష్క కత్తియుద్ధాలు నేర్చుకొంటోంది. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలవుతుంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ ఇదే అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని 'గుణా టీమ్ వర్క్స్' పతాకంపై రూపొందిస్తున్నారు గుణశేఖర్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అయితేనే న్యాయం జరుగుతుందని ఆయన్ను సంగీతదర్శకునిగా తీసుకున్నారు. ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా ('జోధా అక్బర్' ఫేం).

    ''కాకతీయుల చరిత్ర, 'రుద్రమ దేవి' కథ, పాత్రల గురించి దర్శకుడు గుణశేఖర్‌ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఆయన స్క్రిప్ట్‌ మొత్తం చూపించారు. ఆ పాత్ర కోసం నేను నెలన్నర రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నాను'' అని అనూష్క మీడియాకు తెలియచేసారు. గుర్రం స్వారీ,కత్తి తిప్పటం, హుందాగా నడవటం, ప్రత్యేకమైన మాడ్యూలేషన్ వంటివి ఈ శిక్షణలో ఉండనున్నాయని సమాచారం. మరో ప్రక్క దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రం కోసం లొకేషన్స్ ఎంపిక,ఫోటో షూట్ వంటి పనుల్లో గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్నారు.

    వరంగల్‌ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్.

    English summary
    Anushka's Rudramadevi film started at Orugallu from today. Ilayaraja has been roped in to compose songs for Anushka's Rudrama Devi film and art by Thota Tharani.Gunasekhar himself producing the film lavishly under Guna Team Works banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X