twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క బర్త్‌డే గిఫ్ట్: ‘రుద్రమదేవి’ ఫస్ట్‌లుక్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. నవంబర్ 7న అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా ఆ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని టీజర్ కూడా విడుదల చేయనున్నారు.

    సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే...చిత్రానికి సంబంధించి నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నాలుగో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో జరుగుతుంది.

    స్లైడ్ షోలో 'రుద్రమదేవి' ఫస్ట్ లుక్ పోస్టర్స్, సినిమా వివరాలు...

    రుద్రమదేవి

    రుద్రమదేవి

    డిసెంబర్ వరకు జరిగే ఐదు షెడ్యూల్స్‌లో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, కుమార్తె మేథ బాలనటులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్ననాటి రానాగా నటిస్తుండగా, శ్రీకాంత్ కూతురు మేథ 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న రుద్రమదేవిగా నటిస్తున్నారు.

    తారాగణం

    తారాగణం


    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా అనుష్క, చాళుక్య వీరభద్రునిగా రానా, గణపతిదేవునిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా సుమన్, మురారిదేవునిగా ఆదిత్యమీనన్, కన్నాంబికగా నటాలియాకౌర్, ముమ్మడమ్మగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా హంసానందిని, అంబదేవునిగా జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా అదితి చంగప్ప, కోటారెడ్డిగా ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా అజయ్ కనిపించనున్నారు.

    ఉన్నత సాంకేతిక విలువలు

    ఉన్నత సాంకేతిక విలువలు


    తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో ‘రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

    తెరవెనక

    తెరవెనక


    ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    Anushka's Rudrama Devi first look poster released. Rudhramadevi is an upcoming Indian 3D historic film, simultaneously being produced in Telugu and Tamil languages. The film is directed by Gunasekhar, and stars Anushka Shetty, Rana Daggubati in the lead roles, with Prakash Raj and Krishnam Raju.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X