For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూ ఇయర్ గిఫ్ట్: అనుష్క ‘రుద్రమదేవి’ రెగల్ లుక్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: న్యూఇయర్ కానుకగా ‘రుద్రమ దేవి' చిత్రానికి సంబంధించి అనుష్క ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఈ రెగల్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది. అనుష్క అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ద్వారా ‘రుద్రమ దేవి' టీం ప్రేక్షకులందరికీ 2015 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

    అనుష్క టైటిల్ రోల్ లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగినీ గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి'. రానా ముఖ్య పాత్రధారి. నిరువధ్యపురం యువరాజు.. చాళుక్య వీరభధ్రుడుగా రానా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

    Anushka Regal Look Of Rudhramadevi

    సినిమా గురించి దర్శక నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ..‘భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా రూపొందుతున్న మా రుద్రమదేవి చిత్రానికి సంబంధించి ప్రస్తుతం శరవేగంగా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గతంలో రిలీజ్ చేసిన రుద్రమదేవి ఫస్ట్ లుక్‌కి, అల్లు అర్జున్ చేస్తున్న గోన గన్నారెడ్డి ఫస్ట్‌లుక్‌కి చాలా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు అనుష్క తొలి మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నాం' అన్నారు.

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    On the New Year's eve, Gunaa Teamworks is very happy to release the very first motion poster of our queen Rudhramadevi, Anushka Shetty. Enjoy the 'REGAL' look of Rudhramadevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X