ఒక్క రోజుకు లక్ష! అదీ అనుష్క రేంజి...
హైదరాబాద్: హీరోయిన్ అనుష్క రేంజి ఏమిటో...ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమిటో....మరోసారి రుజువైంది. అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన బాహుబలి మేకింగ్ వీడియో యూట్యూబులో ఒక్క రోజులోనే లక్షకు చేరువైంది. స్టార్ హీరోలతో పోటాపోటీగా అనుష్కకు ఇంత ఫాలోయింగ్ ఉండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
మేకింగ్ వీడియో పరిశీలిస్తే....'బాహుబలి' చిత్రంలో అనుష్కను దర్శకుడు రాజమౌళి డిఫరెంటుగా, అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నాడని స్పష్టం అవుతోంది. ముఖ్యంగా అనుష్క మేకప్, కాస్టూమ్స్ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చిత్రం మూడో షూటింగ్ ఈ రోజుతో ముగియనుంది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
'బాహుబలి' సినిమా పూర్తయి 2015లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.....ఈ భారీ గ్యాప్‌లో ప్లాన్ ప్రకారం సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకుసాగుతున్నాడు రాజమౌళి. అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.
ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.


Click it and Unblock the Notifications












