షాకింగ్: ప్రభాస్ కంటే అనుష్కకే ఎక్కువ!
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలదే హవా. హీరోయిన్లకు ఉండే ప్రాధాన్యత, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా తక్కువనే చెప్పాలి. కానీ అనుష్క విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం చేస్తున్న అనుష్క...ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న ప్రభాస్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బాహుబలి చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ప్రభాస్, అనుష్క పుట్టినరోజులను పురస్కరించుకుని మేకింగ్ వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభాస్ ఫస్ట్ లుక్ చూపుతూ ఓ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. యూట్యూబులో ఈ వీడియోకు ఇప్పటి వరకు 1.5 మిలియన్ల హిట్స్ వచ్చాయి.
ఇక అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని నవంబర్ 6న అనుష్క ఫస్ట్ లుక్ విడుదల చేస్తూ మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియోకు ఇప్పటి వరరకు 2 మిలియన్లకు పైగా హిట్స్ వచ్చాయి. ఈ విషయంలో అనుష్క ప్రభాస్ ను మించిపోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ కేరళలో జరుగుతోంది. ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications












