అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ లేపేసారు!
హైదరాబాద్: అజిత్, త్రిష, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘ఎన్నై అరిందాల్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు అదిరిపోయే కలెక్షన్లు తెచ్చి పెడుతోంది. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగదీత ఎక్కువైందనే టాక్ నేపథ్యంలో ఆఫీలింగును పోగొట్టేందుకు ఫస్టాఫ్ కొంత ట్రిమ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమైనట్లు సమాచారం.
ఇందులో భాగంగా సినిమాలో కొన్ని అనవసర సీన్లతో పాటు అనుష్క ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తిగా డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సాధారణ ప్రేక్షకుల సంగతి ఎలా ఉన్నా అనుష్క అభిమానులు మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారట. ఈ మార్పుల తర్వాత కలెక్షన్లు మరింత బావుంటాయని ఆశిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏకంగా రూ. 20.83 కోట్లు వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది. ప్రముఖ ట్రేడ్ అనాలసిస్ట్ త్రినాథ్ ఈ సినిమా కలెక్షన్లపై స్పందిస్తూ..‘ఎన్నై అరిందాల్ కలెక్షన్లు ఆశ్చర్య పరిచే విధంగా ఉన్నాయి. తొలి రోజు రూ. 11.5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 20.83 కోట్లు వసూలు చేసింది. గురువారం రిలీజ్ అయినా ఈ రేంజిలో రెస్పాన్స్ రావడం ఆశ్చర్యకరం' అన్నారు.
గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్.
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "ఎంతవాడు కానీ.." అనే పేరుతో డబ్ అయి విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పడే సినిమా హిట్ అవుతుందని అంచనాలు వేసారు. అంతా అనుకున్నట్లే జరిగింది. అజిత్ మూడు వైవిధ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిషలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











