కీలక ఆధారాలు లభ్యం...దొరికిపోయినట్లే
హైదరాబాద్ : 'రుద్రమదేవి' షూటింగ్ సమయంలో చోరీకి గురైన 100 పౌన్ల బంగారు నగల కోసం హైదరాబాద్ పోలీసులు చెన్నైలో విచారణ జరుపుతున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'రుద్రమదేవి'. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్ర కోసం బంగారు నగలను చెన్నై నుంచి ప్రత్యేకించి తెప్పించుకున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులు చెన్నై విమానాశ్రయంలో దర్యాప్తు నిర్వహించారు. ఇక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆదివారం సుమారు మూడు గంటల పాటు విచారణ జరిపి కీలకమైన ఆధారాలను సేకరించినట్లు సమాచారం.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే...
చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సంప్రదాయ నగలు చోరీకి గురవడంతో సినిమా యూనిట్ సభ్యులు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. గోపన్‌పల్లిలోని రామానాయుడు స్టూడియోకు చెందిన స్థలంలో 'రాణిరుద్రమ' సినిమా చిత్రీకరణ జరుగుతోంది.
ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రను పోషిస్తున్న అనుష్క అలంకరణకు సంప్రదాయ నగలు ఉపయోగిస్తున్నారు. నగలను చెన్నైలోని నాదెండ్ల అంజనేయశెట్టి సంస్థ సరఫరా చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి రవి సుబ్రమణ్యం వాటిని చెన్నై నుంచి తీసుకొచ్చి నిర్వాహకులకు ఉదయాన్నే ఇచ్చి షూటింగ్ అనంతరం తిరిగి తీసుకెళ్తున్నారు.
శనివారం ఉదయం సుబ్రమణ్యం కిలోన్నర బరువున్న ఆభరణాలతో వచ్చారు. మధ్యాహ్నం నగల సంచిని షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న విశ్రాంతి వ్యాన్‌లో డ్రైవర్ సీటు వెనుక ఉంచారు. భోజనం అనంతరం చూడగా సంచిలో నగల పెట్టెలు కనిపించలేదు.
దీంతో సినిమా ఎగ్జికూటివ్ ప్రొడ్యుసర్ రాంగోపాల్ శనివారం రాత్రి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాక్సుల్లో ఎన్ని బంగారు, ఎన్ని రోల్డ్‌గోల్డ్ నగలు ఉన్నాయనే స్పష్టత రాలేదని, సంస్థ నిర్వాహకులు వస్తేనే లెక్క తేలుతుందని ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications











