వెయిట్ ఈజ్ ఓవర్: అనుష్క 'సైజ్ జీరో' టీజర్ (వీడియో)
హైదరాబాద్: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'సైజ్ జీరో' టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆడియోను సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు టీజర్‌లో పేర్కొంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్‌లో 'సైజ్ జీరో'ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక సింగపూర్ లో ఆడియో పంక్షన్ చేయాలని ఈ చిత్రం టీమ్ భావిస్తోంది. గత రెండు నెలలలుగా కంటిన్యూగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని విభిన్నంగా చేయాలని చిత్రం టీమ్ భావిస్తోంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆడియోని మలేషియా లేదా సింగపూర్ లో లాంచ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తెలుగు, తమిళ వారికి రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లు చెప్తున్నారు. అంతేకాదు ఈచిత్రాన్ని సైతం విభిన్నంగా ప్రమోట్ చెయ్యడం కోసం అక్కడ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ మంచి వెన్యూ కోసం చూస్తున్నారు. వెన్యూ ఫిక్స్ అవ్వగానే ఆడియో రిలీజ్ డేట్ ని కూడా ఫైనలైజ్ చేసి ప్రకటిస్తారు. ఈ నెల నే ఆడియో రిలీజ్ ఉండే అవకాశం ఉంది.

ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.
ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఆర్యా, భరత్, ఉర్వసీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు.
ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.


Click it and Unblock the Notifications











