»   »  అనుష్క లాస్ అయింది...దీపిక లాభ పడింది!

అనుష్క లాస్ అయింది...దీపిక లాభ పడింది!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కొచ్చాడయాన్'‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె నటిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ సినిమా క రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా అనగానే మరో ఆలోచన లేకుండా నటించడానికి ఓకే చెప్పింది దీపిక. కొచ్చాడయాన్ కంటే ముందు రజనీతో చేయాలనుకున్న 'రాణా' సినిమా కోసం దీపికను తీసుకున్నారు. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా రద్దుయింది. ఆ తర్వాత కొచ్చాడయాన్ ప్రారంభమైంది. అలా దీపిక 'రాణా' సినిమా నుంచి 'కొచ్చాడయాన్'కు షిప్ట్ అయింది. కానీ ఈ సినిమా కోసం దీపికను ఎంపిక చేయక ముందు నిర్మాతలు ఎవరిని సంప్రదించారో తెలుసా? ఆమె మరెవరె కాదు హాట్ హీరోయిన్ అనుష్క శెట్టి.

  ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ విషయాన్ని స్వయంగా అనుష్కనే వెల్లడించింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న తన తాజా సినిమా 'వర్ణ' ప్రమోషన్లలో పాల్గొంటున్న అనుష్క ఈ సందర్భంగా ఈ విషయాన్ని చెప్పింది. కొచ్చాడయాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, అయితే అప్పట్లో ఇతర సినిమాలకు కమిట్ కావడం వల్ల ఆ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేక అవకాశం వదులుకోవాల్సి వచ్చిందని అనుష్క చెప్పుకొచ్చింది.

  'అవును, రజనీకాంత్ సరసన రాణా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయాను' అని అనుష్క ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంట్వ్యూలో వెల్లడించింది. రజనీకాంత్ గొప్ప నటుడు మాత్రమే కాదు, ఎంతో మంచి వ్యక్తి...ఆయనతో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

  రజనీకాంత్‌తో ఒక్క అవకాశం..

  రజనీకాంత్‌తో ఒక్క అవకాశం..


  రజనీకాంత్ లాంటి గొప్ప స్టార్లతో నటించే అవకాశం ఒక్కసారైనా రావాలని కోరుకుంటున్నాను అని అనుష్క తన మనసులోని మాటను బయట పెట్టింది.

  రజనీ నుంచి నేర్చుకుంటుందట

  రజనీ నుంచి నేర్చుకుంటుందట


  రజనీకాంత్ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయని, నిరాడంబరంగా, హంబుల్‌గా ఉండటం ఎలా అనే విషయాలను ఆయన నుంచి నేర్చుకోవాలని ఉందని అంటోంది అనుష్క.

  రజనీ ఫ్యామిలీ గురించి..

  రజనీ ఫ్యామిలీ గురించి..


  రజనీసార్ ఫ్యామిలీతో తనకు మంచి పరిచయం ఉందని, రజనీ సార్ మంచి వ్యక్తిత్వం వల్లనే అభిమానులకు ఆరాధ్యుడిగా మారాడని అనుష్క అంటోంది.

  బాలీవుడ్‌పై అనుష్క ఆసక్తి చూపుతుందా?

  బాలీవుడ్‌పై అనుష్క ఆసక్తి చూపుతుందా?


  బాలీవుడ్ ఎంట్రీపై మీకు ఆసక్తి ఉందా? అనే ప్రశ్నకు అనుష్క స్పందిస్తూ....తనకు ఇప్పటికే పలు బాలీవుడ్ అవకాశాలు వచ్చాయని, హిందీ వెర్షన్ సింగంలో హీరోయిన్‌గా చేయమని అడిగారని, అయితే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల చేయలేదని అనుష్క వెల్లడించారు.

  బాలీవుడ్ అవకాశాలు

  బాలీవుడ్ అవకాశాలు


  అనుష్కకు తరచూ పలు బాలీవుడ్ అవకాశాలు వస్తూనే ఉన్నాయి...అయితే ఆమెను ఇప్పటి వరకు ఏ ఒక్క బాలీవుడ్ స్క్రిప్టు కూడా మెప్పించలేదట.

  పెళ్లి గురించి అనుష్క..

  పెళ్లి గురించి అనుష్క..


  తన పెళ్లి గురించి ప్రశ్నించినపుడు అనుష్క స్పందిస్తూ...ఇప్పటి వరకు తనకు మిస్టర్ రైట్ ఎవరూ దొరకలేదని, భవిష్యత్‌లో ప్రేమ వివాహం చేసుకుంటానేమో? అని సమాధానం ఇచ్చింది అనుష్క.

  విడుదలకు సిద్ధమైన సినిమా....

  విడుదలకు సిద్ధమైన సినిమా....


  ప్రస్తుతం అనుష్క నటించిన ఇరండామ్ ఉళగం (తెలుగులో ‘వర్ణ') చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

  ఇరండామ్ ఉళగం

  ఇరండామ్ ఉళగం


  ఇరండామ్ ఉళగం చిత్రంలో అనుష్క, ఆర్య జంటగా నటిస్తున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పివిపి సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నవంబర్ 22న ఈచిత్రం విడుదలవుతోంది.

  English summary
  
 As we all know, Deepika Padukone is the leading lady of Rajinikanth starrer multilingual movie Kochadaiiyaan. The Bollywood diva had given a nod to star in the movie without a second thought. Later, the same team started Kochadaiiyaan, a prequel to Rana, which was shelved for some reasons. But did you know who was approached before the offer knocked the doors of Deepika? Well, it is none other than Anushka Shetty!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more