హాట్ అనుష్క కాదు...ఫైటింగ్ పాప!
కత్తిలాంటి ఫిగర్‌తో యూత్ మతిపోగొడుతున్నహాట్ హీరోయిన్ అనుష్క....ఫైటింగ్ పాప అవతారం ఎత్తబోతోంది. ఇందు కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. అనుష్క తమిళంలో నటిస్తున్న 'ఇరందమ్ ఉలగమ్' అనే చిత్రానికి గాను ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటోంది. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుంది. ఇందులో ఒక పాత్రలో ట్రైబల్ ఉమెన్ పాత్రలో కనిపించనుందట. ఈ పాత్రలో కొన్ని పోరాట సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది. మరో పాత్రలో మోడ్రన్ గర్ల్ గా కనిపిస్తుందని అంటున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గతంలో అనుష్క అరుంధతి, పంచాక్షరి చిత్రాల్లో కూడా ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే.
ఈ సంవత్సరం అనుష్క చేతిలో ఐదు సినిమా ప్రాజెక్టులో ఉండగా....అందులో మూడు తమిళ సినిమాలే. రెండు మాత్రమే తెలుగు సినిమాలున్నాయి. అవి నాగార్జునతో కలిసి నటించిన 'డమరుకం' చిత్రంతో పాటు, ప్రభాస్‌తో వారధి(వర్కింగ్ టైటిల్) చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఈ సంవత్సరంలోనే విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











