అనుష్క ‘రుద్రమదేవి’ మేకింగ్ వచ్చేసింది (వీడియో)
హైదరాబాద్ : క్రితం సంవత్సరం అనుష్క పుట్టినరోజు సందర్భంగా కాకతీయ సామ్రాజ్యపు వీరనారి గెటప్ ఇదంటూ ‘రుద్రమదేవి' ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర దర్శకనిర్మాత గుణశేఖర్. ఈ ఏడాది కూడా అనుష్క బర్త్‌డే గిప్ట్‌గా ఈ చిత్రం మేకింగ్ వీడియో జర్నల్ ని విడుదల చేసారు. అంతేకాక రాజకుమారి వేషధారణలో ఉన్న రుద్రమదేవి చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. మొదటి పోస్టర్ రుద్రమదేవి రాజసాన్ని తెలియజేస్తే, రెండవ పోస్టర్ ఆమెలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. అల్లుఅర్జున్, రానా కీలక పాత్రధారులు. మరి మేకింగ్ వీడియో జర్నల్ లో ఏముందో చూద్దామా...
ఇందులో అనుష్క రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతోంది. ఒకటి వీరనారిగా అయితే రెండోది గ్లామరస్ ప్రిన్సెస్. ఈ రెండు గెటప్‌ల కోసం కేవలం మూడు నెలల వ్యవధిలో తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంది. తనలో ఆ మార్పును, డెడికేషన్ చూసి మా యూనిట్ అంతా షాకయ్యారు. ఆ తేడాను ఆడియన్స్ కూడా గుర్తిస్తారు.
దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ ....''పన్నెండేళ్ల క్రితమే 'రుద్రమదేవి' చరిత్రని సినిమాగా తీయాలన్న ఆలోచన వచ్చింది. అప్పట్లో ఆ పాత్రకు ఎవరు సరితూగుతారా? అంటూ అన్వేషించా. కొంతమందితో ఫొటో షూట్ కూడా నిర్వహించాం. ఓసారి 'అరుంధతి' సినిమా చూశా. అందులో జేజమ్మగా అనుష్కని చూసి షాక్ తిన్నా. 'నా రుద్రమదేవి దొరికేసింది' అనిపించింది. ఈ సినిమాని నేనెంత ప్రేమించానో, అంతకంటే ఎక్కువగా ప్రేమించింది అనుష్క. షూటింగ్ మొదలెట్టక ముందే ఎన్నో కసరత్తులు చేసింది, గుర్రపు స్వారీ నేర్చుకొంది.

'రుద్రమదేవి దిగొచ్చింది' అనుకొనేలా కష్టపడింది. పోరాట సన్నివేశాల్లో హీరోలు ఎంతో రిస్క్ తీసుకొంటారో, అనుష్క అంతకంటే ఎక్కువగానే తీసుకొంది. ఓ సన్నివేశంలో నూటయాభై అడుగుల ఎత్తున వేలాడుతూ నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రలో రెండు ఛాయలుంటాయి. ఒకటి రాణీ రుద్రమ, మరోటి యువరాణి ఝాన్సీ. రుద్రమదేవి పాత్రలో రాజసం, ఠీవీ ఎంత ముఖ్యమో.. రాజకుమారిగా కనిపించాలంటే సున్నితత్వం, లాలిత్యం అంతే అవసరం.
రాజకుమారి పాత్ర కోసం మూడు నెలల విరామంలో బరువు తగ్గి, మళ్లీ స్లిమ్‌గా మారింది. ఆమెను రాజకుమారిగా చూసి యూనిట్ సభ్యులు మొత్తం ఆశ్చర్యపోయాం. ఈ ప్రయాణంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొంటే 'అనుష్క లేకపోతే రుద్రమదేవి సినిమాను తీయగలనా?' అనిపించింది. ఆమె ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలి..'' అన్నారు.
ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.


Click it and Unblock the Notifications











