రుద్రమదేవి : మగరాయుడిలా అనుష్క (న్యూ ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో అనుష్క వీరనారిగా కనిపించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి అనుష్క తాజా ఫోటో ఒకటి బయటకు లీకైంది. ఈ ఫోటోలో అనుష్క లుక్ వీరనారిగా కాకుండా....మగరాయుడిలా కనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది సర్వత్రా. మీరూ ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

సినిమా షూటింగ్ వివరాల్లోకి వెళితే...చిత్రానికి సంబంధించి నాలుగో షెడ్యూల్ ప్రారంభమైంది. భారతదేశంలో తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నాలుగో షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల్లో జరుగుతుంది.

డిసెంబర్ వరకు జరిగే ఐదు షెడ్యూల్స్‌లో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, కుమార్తె మేథ బాలనటులుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ 14 ఏళ్ల ప్రాయంలో ఉన్న చాళుక్య వీరభద్రుడి పాత్రలో చిన్ననాటి రానాగా నటిస్తుండగా, శ్రీకాంత్ కూతురు మేథ 9 ఏళ్ల ప్రాయంలో ఉన్న రుద్రమదేవిగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X