twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమదేవి' తో అనుష్క సెల్ఫీ (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, రానా, కృష్ణంరాజు కీలక పాత్రలు పోషించారు. గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్‌ త్రీడీ ద్విభాషా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుది దశ వీఎఫ్‌ఎక్స్‌ పనులు చేపడుతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతూండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. ఈ నేపధ్యంలో అనుష్క ...రుద్రమ దేవితో తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లలో ముందుకు వెళ్తోంది. ఆ ఫొటోని ఇక్కడ చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Our #Rudhramadevi Anushka Shetty's Selfie with 'Rudhramma Radham'! Be ready to take selfie with the Radham when you spot...

    Posted by Rudhramadevi on 15 August 2015

    దర్శకనిర్మాత మాట్లాడుతూ '' ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు దేశవిదేశాల్లో చేపడుతున్నాం. తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుంది. రుద్రమదేవిగా అనుష్క, పోరుగడ్డపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ అభినయం ఆకట్టుకుంటుంది'' అన్నారు.

    గుణశేఖర్‌ మాట్లాడుతూ... ‘‘భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియో స్కోపిక్‌ 3డి సినిమాగా ఎంతో భారీ వ్యయంతో తయారవుతున్న మా చిత్రానికి మెగాస్టార్‌ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ కూడా పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్‌'కు అమితాబ్‌ బచ్చన్‌ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఎంతటి ఎస్సెట్‌ అయ్యిందో, మా చిత్రానికి చిరంజీవిగారిచ్చిన వాయిస్‌ ఓవర్‌ ఓ స్పెషల్‌ అట్రాక్షన్‌ అవుతుంది. అడగ్గానే అంగీకరించి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'' అని చెప్పారు.

    Anushka's selfie with Rudramadevi

    గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటించిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, సుమన్‌, ప్రకాశ్‌రాజ్‌, నిత్యా మీనన్‌, కేథరిన్‌ ట్రెసా, ప్రభ, జయప్రకాశ్‌రెడ్డి, ఆదిత్య మీనన్‌, ప్రసాదాదిత్య, అజయ్‌, విజయ్‌కుమార్‌, వేణుమాధవ్‌, ఉత్తేజ్‌, వెన్నెల కిశోర్‌, కృష్ణభగవాన్‌, ఆహుతి ప్రసాద్‌, చలపతిరావు, శివాజీరాజా తారాగణం. ఇళయరాజా సంగీతం సమకూర్చారు.

    ఈ చిత్రంలో రాణీ రుద్రమగా..అనుష్క, చాళుక్య వీరభద్రునిగా..రానా, గోనగన్నారెడ్డిగా..అల్లు అర్జున్, గణపతిదేవునిగా..కృష్ణంరాజు, శివదేవయ్యగా..ప్రకాష్ రాజ్, హరిహరదేవునిగా..సుమన్, మురారిదేవునిగా..ఆదిత్యమీనన్, నాగదేవునిగా..బాబా సెహగల్, కన్నాంబికగా..నటాలియాకౌర్, ముమ్మడమ్మగా..‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా..హంసానందిని, అంబదేవునిగా..జయప్రకాష్రెడ్డి, గణపాంబగా..అదితి చంగప్ప, కోటారెడ్డిగా..ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా..అజయ్ కనిపించనున్నారు. వీరితో పాటు నిత్యామీనన్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

    ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, పాటలు: సీతారామశాస్త్రి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, కళ: తోట తరణి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కె. రామ్‌గోపాల్‌, సమర్పణ: రాగిణీ గుణ, కథ, స్ర్కీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్‌.

    English summary
    Anushka Shetty's Selfie with 'Rudhramma Radham'. Rudhramadevi‬ is not just Tollywood's first Stereoscopic 3D film but the Nation's First Historical Stereoscopic 3D and it's a bilingual Tamil - Telugu film being dubbed into Malayalam & Hindi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X