For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క ‘సైజ్ జీరో’కొత్త పోస్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : హీరోయిన్ అనుష్క త్వరలోనే వైవిధ్యమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో ద్వి భాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో చిత్రానికి సంభందించిన పోస్టర్స్ ని విడుదల చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఓ పోస్టర్ వదిలారు. మీరు ఇక్కడ దాన్ని చూడండి.

    Here's the fourth poster of Size Zero Movie & Inji Iduppazhagi

    Posted by PVP Cinema on 23 August 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో'. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. అలాగే హీరో ఆర్య ఇచ్చిన టిప్స్ సహాయంతో మళ్లీ బరువు తగ్గి నార్మల్ అయింది.

    Anushka's Size Zero movie new poster

    ఇక హీరో ఆర్య ఇటీవల స్వీడన్ మీదుగా కఠినతరమైన సైకిల్ రైడ్ ను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. సైజ్ జీరో నిర్మాతలు ఈ చిత్రంలో అలాంటి కష్టతరమైన సైక్లింగ్ విన్యాసాలను ఇందులో చూపిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యయం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    అనుష్క, ఆర్య, భరత్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిర్వాషా, ఆర్ట్: ఆనంద్ సాయి, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెల మూడి.

    English summary
    Anushka's ‘Size Zero’ is progressing at brisk pace under the direction of Prakash Kovelamudi. According to the latest film makers released new poster of the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X