పవన్, మహేష్ బాబుతో పోటీ పడుతున్న అనుష్క!
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో పోటీ పడుతోంది హాట్ హీరోయిన్ అనుష్క. ఇంతకీ ఏ విషయంలో పోటీ పడుతున్నారని అనుకుంటున్నారా? రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం కాదులెండి. ఆమె పోటీ పడుతుంది వేరే విషయంలో.
ఈ మధ్య టాలీవుడ్లో సినిమా ట్రైలర్స్ విడుదల చేసి యూట్యూబు హిట్స్ విషయంలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది', అంతుకు ముందు విడుదలైన మహేష్ బాబు '1' మూవీ టీజర్ యూట్యూబ్‌లో రికార్డు స్థాయి హిట్స్ సొంతం చేసుకున్నాయి.
అనుష్క నటించిన 'వర్ణ' సినిమా ట్రైలర్ కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమా ట్రైలర్లతో పోటీ పడుతూ యూ ట్యూబ్‌లో హిట్స్ సొంతం చేసుకుంటోంది. ఆదివారం విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటి వరకు 6 లక్షల పై చిలుకు హిట్స్ సొంతం చేసుకుంది. అనుష్కకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే ఈ రేంజిలో హిట్స్‌కు కారణమవుతోందని అంటున్నారు.
ఆడువారి మాటలకి అర్దాలే వేరులే చిత్రంతో తెలుగువారికి పరిచయమైన శ్రీరాఘవ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'ఇరండమ్ ఉలగం' చిత్రం తెలుగులో 'వర్ణ' పేరుతో విడుదలవుతోంది. ఆర్య, అనుష్క జంటగా నటించారు. ఈ చిత్రాన్ని పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కీలకమైనది. ఆ పాత్రకు అనుష్క ప్రాణంపోసింది. ఆమె పై వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని చెప్తున్నారు.
''జార్జియా దేశంలో తెరకెక్కించిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అక్కడ 18వ శతాబ్దంనాటి భవంతిలో చిత్రించిన దృశ్యాలు కీలకమైనవి'' అని దర్శకుడు తెలిపారు. గతంలో 'అరుంధతి' చిత్రంలో కత్తి పట్టిన అనుష్క....వర్ణ చిత్రంలో కత్తి పోరాటాలు చేస్తూ సాహస యువతిగా కనిపించనుంది. ఈ పోస్టర్లు చూస్తుంటే సినిమా విభిన్నంగా, సరికొత్తగా ఉంటుందని స్పష్టం అవుతోంది. గతంలో 'యుగానికి ఒక్కడు' లాంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించిన సెల్వరాఘవన్ ఈ సినిమానే ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











