అనుష్క యోగాసనాలు తొలిసారిగా తెరమీద
అనుష్క వేసిన యోగాసనాలు తొలిసారి తెరమీద కనిపించింది మా సినిమాలోనే. 'పంచాక్షరి' పాత్ర కోసం తను బాగా తగ్గింది. రాత్రిళ్ళు మహేష్‌బాబు సినిమా షూటింగ్ చేస్తూ పగలు మా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలూ ఉన్నాయి. సొంత సినిమా అనుకుని చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అనుష్క సహకారం లేకపోతే ఈ సినిమానే లేదు అంటున్నారు 'పంచాక్షరి' నిర్మాత బొమ్మదేవర రామచంద్రరావు (చంద్ర). అనుష్క ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 'పంచాక్షరి' క్రితం వారం రిలీజైంది. ప్రమోషన్ లో భాగంగా మీడియాను కలిసిన చంద్ర మాట్లాడుతూ..ఈ సినిమాలో అనుష్కకు 'బ్యూటీ క్వీన్' అనే టైటిల్ కూడా వేశాం. హనీ పాత్రలో తను వేసిన మాస్ స్టెప్పులు కూడా యువతను మరింతగా అలరిస్తున్నాయి. సినిమా ప్రారంభంలో మోహన్ బాబుగారు చెప్పిన వాయిస్ ఓవర్ గురించి కూడా అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు అన్నారు.


Click it and Unblock the Notifications











