»   » జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భయపడుతోన్న స్టార్ హీరోయిన్...

జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో భయపడుతోన్న స్టార్ హీరోయిన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

థర్టీ ప్లస్ హీరోలందరితో హ్యాపిగా నటించేస్తున్న అనుష్క జూ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ట్వంటీ ప్లస్ హీరోల సరసన మాత్రం నటించట్లేదు. అల్లు అర్జున్ తో వేదంలో కలిసి నటించినా అతనికి జోడిగా నటించలేదు. ఈ ముగ్గురు హీరోలతో నటించడానికి ఏజ్ ఫ్యాక్టర్ తో పాటు హైట్ ప్రాబ్లెమ్ కూడా అనుష్క కి తలెత్తుంది. ఈ ముగ్గురు హీరోలు అయిదడుగుల ఏడంగుళాలే ఉండడంతో అయిదడుగుల పదంగుళాల హైటున్న అనుష్క వీరితో నటించే సాహసం చేయలేదు. పైగా వారికి అక్కలా కనిపిస్తుందనే అభిప్రాయం కూడా ఉండడంతో వారి సినిమాల్లో అనుష్కకి అవకాశమివ్వడం లేదు. ఇక పోతే ఒక వేళ జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరితో నటించడానికి ఇష్టపడతావని అడిగితే అనుష్క తడుముకోకుండా జూ ఎన్టీఆర్ అని చెప్పింది. అనుష్క అభిమాని ఎవరో ఆమె చరణ్ తో నటిస్తే చూడాలని ఉందని అనగానే పకపకా నవ్వేసింది. ఆమె నవ్వుకి అర్థమేమిటో ఆమెకే తెలియాలి. చరణ్ తన పక్కన పిల్లాడిలా ఉంటాడనా, పొట్టోడైపోతాడనా?అలా అనుకుంటే జూ ఎన్టీఆర్ కూడా చరణ్ హైటే కదా? తనకి నచ్చిన హీరో ఎవరంటే మాత్రం నాగార్జునేనని కుండ బద్దలుకొట్టేసింది. అదే రేస్ లో చిరంజీవి 150 చిత్రానికి ఐశ్వర్య రాయ్ కి డేట్స్ ఖాలీ లేనందున అనుష్క రేస్ లో ఉన్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X