నిర్మాతగా మారుతున్న అనుష్కా ..డిటేల్స్

By Srikanya

ముంబై: అందాలభామ అనుష్కాశర్మ నటిగా మురిపించటమే కాకుండా నిర్మాతగా మెప్పించనుంది. మొదటి చిత్రం 'రబ్‌నే బనాది జోడి'తో బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌తో తెరంగేట్రం చేసి అదృష్టాన్ని అంది పుచ్చుకుంది. తన సినీ ప్రయాణంలో ఇప్పటివరకు నటించింది పదికి లోపే చిత్రాలు అయినప్పటికీ నిర్మాతగా మరో కొత్త పాత్రలో ప్రవేశించనుంది. 'ఎన్‌హెచ్‌10' పేరుతో తెరకెక్కనున్న ఆ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఫాంటమ్‌'తో కలిసి సహ నిర్మాతగా వ్యవహరించనుంది.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ 'ఎన్‌హెచ్‌10'కు నవ్‌దీప్‌ సింగ్‌ దర్శకత్వం వహించనున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'మనోరమా సిక్స్‌ ఫీట్‌ అండర్‌' చిత్రంతో బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అయిన నవ్‌దీప్‌ తన మొదటి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలను సొంతం చేసుకున్నాడు. పాతిక సంవత్సరాల ప్రాయంలోనే నిర్మాతగా అవకాశం రావడంపట్ల తబ్బిబ్బైపోతోందీ అనుష్కా.

ఒక ప్రయాణంలో చోటుచేసుకున్న పదనిసలతో కూడుకున్న 'ఎన్‌హెచ్‌10' చిత్రం కథ వినగానే తనకు ఎంతో నచ్చిందని, తాను నిర్మాతగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం తనకు దొరకదని సంబంరపడిపోతోందీ చిన్నది. త్వరలో ఢిల్లీతో పాటు చుట్టుప్రక్కల ప్రదేశాల్లో షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ప్రస్తుతం అనుష్కా శర్మ 'బాంబే వెల్వెట్‌' అనే చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, దీన్ని నిర్మిస్తోంది ఫాంట్‌మ్‌ సంస్ధకాగా, సహ నిర్మాత రణ్‌బీర్‌ కపూర్‌ కావడం గమనార్హం. అంతేకాకుండా అందరూ ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్న 'పీకే' చిత్రంలోనూ ప్రస్తుతం నటిస్తోంది అనుష్కా శర్మ. ఈ చిత్రంలో హీరో అమీర్‌ఖాన్‌ కాగా, ప్రముఖ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో రూపుదిద్దుకోవడమే సినీ అభిమానుల ఉత్కంఠతకు కారణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X