»   » అనుష్క పెదాలు ఎందుకు వాచిపోయాయి? అంటే..

అనుష్క పెదాలు ఎందుకు వాచిపోయాయి? అంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించిన 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో న్యూ లుక్‌తో దర్శనమిచ్చింది. ఎంతో ముద్దు ముద్దుగా... చిట్టి చిట్టిగా..హాట్ అండ్ సెక్సీగా ఉండే అనుష్క పెదాలు డిఫరెంటుగా లావెక్కి కనిపించాయి. అంతటితో ఆగకుండా తన న్యూలుక్ గురించి అభిమానుల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలనే కోరిక కలిగింది ఈ బ్యూటీకి....

'నా న్యూ లుక్ ఎలా ఉంది? నా పెదాల గురించి మాట్లాడండి..ఎలా ఉన్నాయో చెప్పండి' అంటూ.....ట్విట్టర్లో ఓ కామెంట్ విసిరింది. దీంతో చాలా మంది అభిమానులు తమ తమ అభిప్రాయాలు వెల్లడిచారు. నీ పెదాలు సహజంగా లేవని కొందరు, ప్లాస్టిక్ సర్జరీ తర్వాత నీ లిప్స్ అందంగా లేవని మరికొందరు కామెంట్స్ చేసారు.

anushka sharma,

ఇలా అభిమానుల అభిప్రాయాల తర్వాత..... అనుష్క శర్మ అసలు విషయాన్ని వెల్లడించింది. తాను పెదాలకు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేసుకోలేదని స్పష్టం చేసింది. తాత్కాలికంగా పెదాలను పెద్దగా మార్చే మేకప్ టెక్నిక్స్ వాడానని, దాదాపు సంవత్సరకాలంగా ఇందుకు సంబందించిన టిప్స్ తాను నేర్చుకున్నానని, త్వరలోనే తన పెదాలు మామూలు స్థితికి వస్తాయని సమాధానం ఇచ్చింది.

తాను నటిస్తున్న 'బాంబే వెల్వెట్' చిత్రం కోసమే ఈ న్యూ లుక్ ట్రై చేసానని అనుష్క శర్మ తెలిపింది. బాంబే వెల్వెట్ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నారు. రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్, రవీనా టండన్, కెకె మీనన్, సిద్ధార్థ బసు తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ సంవత్సరం క్రిస్‌మస్ నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
A lot was spoken of Anushka Sharma's 'lips' when she recently made her appearance in Koffee With Karan. It seemed like she had got a lip job done since her natural thin lips appeared relatively big. Many of her fans did not like her 'new' look and thought that she looked better the way she was.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu