Anushka Sharma, Virat Kohli కూతురికి రేప్ బెదిరింపులు.. హైదరాబాదీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, భారతీయ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వమికాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం చిన్నారి వమికాను రేప్ చేస్తానని బెదిరింపులకు గురిచేసిన హైదరాబాదీ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

విరాట్ కోహ్లీ, అనుష్కపై దారుణంగా

విరాట్ కోహ్లీ, అనుష్కపై దారుణంగా

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నిలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు చేతిలో ఇండియన్ క్రికెట్ టీమ్ దారుణంగా ఓడిపోయింది అయితే అప్పటి నుంచి భారతీయ బౌలర్ మహ్మద్ షమీతోపాటు పలువురు క్రికెటర్లను టార్గెట్ చేసుకొని ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో దుర్బాషలాడుతూ ఎటాక్ చేశారు. ఈ క్రమంలోనే వారికి విరాట్ కోహ్లి మద్దతుగా నిలిచారు. అయితే సమీ, ఇతర క్రికెటర్లకు సపోర్ట్ చేయడంతో విరాట్ కోహ్లిపై దారుణంగా ట్వీట్లు చేశారు.

అనుష్క తొమ్మిది నెలల కూతురును రేప్ చేస్తామంటూ

అనుష్క తొమ్మిది నెలల కూతురును రేప్ చేస్తామంటూ

అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కూతురును టార్గెట్ చేస్తూ.. Criccrazyygirl ట్విట్టర్ అకౌంట్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. అనుష్క, విరాట్ దంపతుల తొమ్మిదినెలల కూతురు వమికాను రేప్ చేస్తామని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు.

విరాట్, అనుష్క దంపతులకు అండగా

విరాట్, అనుష్క దంపతులకు అండగా


అయితే విరాట్, అనుష్క దంపతులపై ఇలాంటి దారుణమైన కామెంట్లతో ఆన్‌లైన్ బెదిరింపులకు పాల్పడటం హేయమైన చర్య. మానమాత్రులు ఎవరూ కూడా ఇలాంటి సోషల్ మీడియా ఎటాక్స్‌ను ఉపేక్షించకూడదు. నాగరిక ప్రపంచంలో ఇంతకంటే దారుణమైన, నీచమైన సంఘటన మరోటి ఉండదు. సభ్యసమాజమంతా ఇలాంటి దాడులను ఖండించాలి అంటూ అనుష్క, విరాట్ కోహ్లీ దంపతులకు సంఘీభావం ప్రకటించారు.

ఢిల్లీ కౌన్సిల్ ఫర్ ఉమెన్ సుమోటోగా

ఢిల్లీ కౌన్సిల్ ఫర్ ఉమెన్ సుమోటోగా

విరాట్ కోహ్లీ, అనుష్క దంపతుల కుమార్తె వమికాను రేప్ చేస్తామని బెదిరించిన సంఘటనపై ఢిల్లీ కౌన్సిల్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. దాంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.

Recommended Video

Hero Sudheer Babu Interaction With His Lady Fan
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

ఢిల్లీ కౌన్సిల్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) ఆదేశాలతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తును చేపట్టి సోషల్ మీడియా అకౌంట్లను ట్రాక్ చేశారు. వమికాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గుర్తించారు. గతంలో ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ ఫుడ్ డెలివరీ యాప్‌లో పనిచేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం హైదరాబాదీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X