పోలీస్ కంప్లైంట్ ఇచ్చా..వదలనంటున్న హాట్ బ్యూటీ అనుష్క
డెరైక్ట్‌గా పోలిస్ స్టేషన్‌కి వెళ్లి కేసు కూడా నమోదు చేశా....ఎవరో పనీపాటా లేని రాస్కెల్స్ చేసిన పని ఇది. దీన్ని అంత తేలిగ్గా వదలను. వాళ్ల అంతు చూస్తాను అంటూ విరుచుకు పడుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కా శర్మ. ఆమె కోపానికి కారణం..ఆమె ఫోటోని రీసెంట్ గా మార్పింగ్ చేసి నెట్ లో పెట్టారు. టూపీస్ బికినీతో చాలా బోల్డ్‌గా ఉన్న అనుష్క ఫొటో ప్రస్తుతం నెట్‌లో దర్శనమిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ..నాలాగా చాలామంది ఈ మార్ఫింగ్‌లకు గురి అవుతున్నారు. సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్న సినిమా తారలకు ఇలాంటి పరిస్థితులు ఎదరవ్వడం కామనే. కానీ ఈ మార్ఫింగ్ కారణంగా అనేక మంది చదువుకునే అమ్మాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. అందుకే ఈ పోరాటం చేయాలనుకుంటున్నాను అని ఆవేశంగా చెప్పింది.


Click it and Unblock the Notifications











