బికినీ వేసుకోవడానికి సిద్దమయ్యే అలాంటి పనులు చేస్తుంది
'దిల్ బోలే హడిప్పా' సినిమాలో బికినీ వేసుకోవడానికి రాణి ముఖర్జీ అదే పనిగా ఎనిమిది కిలోలు బరువు తగ్గి నాజూకు ఆకృతిని తెచ్చుకొంది. 'తషాన్' చిత్రంలో బికినీలో కనువిందు చేయడానికి కరీనా కపూర్ ఏకంగా జీరో సైజుకి మారిపోయింది. ఇప్పుడు తన వంతు వచ్చినట్లు అనుష్క శర్మ సిద్ధమవుతోంది. 'లేడీస్ వర్సెస్ రికీ భల్' చిత్రం కోసం ఆమె బికినీలో దర్శనమీయబోతోంది. ఇందుకోసం కరీనా మార్గాన్నే అనుష్క కూడా ఎంచుకొంది. జీరో సైజుకి దేహాకృతిని మార్చుకోవడానికి కసరత్తులు ప్రారంభించింది.
అలాగని కృత్రిమ పద్ధతుల్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేసింది. సహజ సిద్ధంగా దేహాన్ని మార్చుకోవాలనేది అనుష్క సిద్ధాంతమట. గతంలో అప్పుడప్పుడు జిమ్‌కి వెళ్లే అనుష్క ఇప్పుడు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తోంది. 'లేడీస్ వర్సెస్ రికీ భల్' సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర డిమాండు మేరకే జీరో సైజుకి మారాల్సి వస్తోంది. గోవాలో బీచ్‌లో ఎక్కువగా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ కథానాయకుడు. ఇంతకీ అనుష్క బికినీ అందాలు ప్రేక్షకుల్ని ఎంతమేరకు కనువిందు చేస్తాయో చిత్రం వచ్చే వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











