»   » అనుష్కకు లీగల్ నోటీసులు, ఏం జరిగిందంటే...

అనుష్కకు లీగల్ నోటీసులు, ఏం జరిగిందంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మకు బృహణ్ ముంబయి కార్పొరేషన్(బిఎంసి) నోటీసులు పంపించింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో అనుష్క నివాసం ఉంటున్న బద్రినాథ్ టవర్ లో తన ఫ్లాట్ బయట ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ ఏర్పాటుచేయడంపై ఇరుగు పొరుగు వారు ఫిర్యాదు చేయడంతో ఈ నోటీసులు అందాయి.

బద్రినాథ్ టవర్స్ లో 20వ అంతస్తులో అనుష్క నివాసం ఉంటోంది. ఈ బిల్డింగులో పాసేజ్ వేలో ఎలక్ట్రిక్ జంక్షన్ బాక్స్ బిగించడంపై... ఆ బిల్డింగ్ మాజీ సెక్రటరీ, అనుష్క ఇంటి పొరుగున నివాసం ఉంటున్న సునీల్ బాత్రా ఈ ఫిర్యాదు చేసారు.

Anushka Sharma gets legal NOTICE from BMC after KapilSharma

ఇలా బిల్డింగులో ఎలక్ట్రిక్ బాక్స్ బిగించడం అక్రమం అని, వెంటనే దీన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని సునీల్ బాత్రా అధికారులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ ఫిర్యాదు అనుష్క పేరు మీద కాకుండా ఫ్లాట్ నం 2001, 2002 ఓనర్ పేరు మీద ఉంది. ఈ రెండు ప్లాట్లు అనుష్కకు చెందినవే కావడం విశేషం. ఏప్రిల్ 6న అధికారుల నుండి ఆమెకు ఈ నోటీసులు అందాయి.

ఈ నోటీసులపై అనుష్క అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... అనుష్క శర్మ చట్ట విరుద్ధంగా ఏమీ చేలేదని, నోటీసులకు తగిన సమాధానం ఇవ్వనున్నట్లు తెలిపారు.

English summary
Bollywood Actress Anushka Sharma has landed in trouble with the BMC. A notice has been issued to actress Anushka Sharma by K west ward of BMC to remove an electric junction box outside her flat in the passage of Badrinath Tower in Versova. However, it was not BMC but her neighbors who took the notice of the box. Watch video to know more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu