అలాంటి ఫీలింగ్ ఏం లేదు : అనుష్క
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో ‘దిల్ ధడక్నె దో' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. అయితే అనుష్క కంటే కంటే ప్రియాంకదే సినిమాలో పెద్ద పాత్ర, ప్రాధాన్యం ఉన్న పాత్ర.
దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ....‘మల్టీస్టారర్ చిత్రంలో నటించడం వల్ల నేనేమీ ఇన్ సెక్యూర్ ఫీల్ కావడం లేదు. ఫ్రియాంక కంటే నా పాత్ర చిన్నదే. అయినా నేనేమీ ఫీల్ కావడం లేదు. వాస్తవానికి దర్శకురాలు జోయా అక్తర్ తొలుత నన్ను ఈ పాత్ర గురించి అడగటానికి వచ్చినప్పుడు నేను ఒప్పుకోనేమో అనుకుంది. కానీ పాత్ర నచ్చడంతో నేను ఒప్పుకున్నాను' అన్నారు అనుష్క.

ప్రస్తుతం అనుష్క శర్మ అమీర్ ఖాన్ నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘పికె'లో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ....అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘పికె' చిత్రానికి పని చేయడం సంతోషంగా ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











