హీరోయిన్ వేటలో అరుంధతి?
అరుంధతి చిత్రానికి హీరోయిన్ కోసం తీవ్రంగా సెర్చింగ్ జరుగుతోంది. అదేంటి అరుంధతి రిలీజై దాదాపు ఎనభై రోజులు అవుతోంది కధా ఇప్పుడీ వేట ఏమిటీ అంటే..హిందీ వెర్షన్ తీయటం కోసం ఈ పాట్లని తెలుస్తోంది. అనూష్క పాత్రను రబ్ నే బనాదే జోడి చిత్రం హీరోయిన్ అనూష్క శర్మని అడుగుదామని ప్రయత్నించారు. కానీ ఆమె యష్ రాజ్ ఫిల్మ్ వారి కాంట్రాక్ట్ లో ఉండటంతో బయిట సినిమాలు చేయటానికి అవకాశం లేదని విరమించుకున్నారు. అయితే తెలుగులో చేసిన అనూష్కని సైతం వారు పరిశీలిస్తున్నారు. అయితే మార్కెట్ దృష్ట్యా ఎంత వరకూ వర్కవుట్ అవుతుందని లెక్కలు వేస్తున్నారు. అలాగే రైట్స్ ఇంకా శ్యామ్ ప్రసాద్ రెడ్డి దగ్గరే ఉన్నట్లు సమాచారం.
తెలుగులో అఘోరా గా చేసిన సోనూ సూద్ ని అలాగే కంటెన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు. జూన్ లో ఈ చిత్రం రీమేక్ స్టార్టవుతుందని సోనూ సూద్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. హిందీ వెర్షన్ కి మరింత ఖర్చు, కొంత పాలీష్ చేసి వర్కవుట్ చేయటానికి నిర్ణయించుకున్నారు. ఇక దర్శకుడుగా ప్రియదర్శన్ ని సంప్రదించారు. కానీ ఆయన వేరే ప్రాజెక్టులలో పూర్తి స్ధాయి బిజీగా ఉండటంతో స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన రాహుల్ నంబియార్ ని డైరక్టర్ గా హిందీకి పరిచయం చేయనున్నారు.
ఇక హిందిలో అనూష్క లవర్ గా చేసిన దీపిక్ చేయనంటున్నాడు. చూసారుగా తెలుగులో నా పాత్ర. అటువంటి పాత్ర చేస్తే ఇప్పుడిప్పుడే హిందిలో నాకు వస్తున్న ఆఫర్లు సైతం తగ్గిపోతాయి. అతను ఫ్యాషన్ చిత్రంలో చేసినప్పుటి నుంచీ కెరిర్ పై చాలా ఆశలతో ఉన్నాడు. విద్యాబాలన్ అయితే ఈ పాత్రకు ఫెరఫెక్ట్ గా సరిపోతుందని భావించి ఆమెను త్వరలో కలిసి డేట్స్ అడగనున్నారని చెప్తున్నారు. ఏమో ఎవరు ఈ పాత్రను చేయనున్నారో గానీ మంచి క్రేజ్ మాత్రం వచ్చింది.


Click it and Unblock the Notifications











