అనుష్క-కోహ్లి విషయంలో మరోసారి అది నిజం కాదని తేలింది
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. పలానా తేదీన వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు రాగా వారి ప్రతినిధులు ఖండించారు. తాజాగా బుధవారం మరోసారి వీరి పెళ్లి వార్తలు మీడియాలో జోరందుకున్నాయి.

ఇటలీలో వివాహం అంటూ...
ఈ నెల 12న అనుష్క-కోహ్లి వివాహం జరుగబోతోందని, ఈ వేడుక ఇటలీలో జరగనుందని, ఇందుకోసం కోహ్లీ గురువారమే ఇటలీ బయల్దేరుతున్నాడన్న ప్రచారం అభిమానుల్లో ఆసక్తి రేపింది.

అనుష్క మేనేజర్ వివరణ
ఈ వార్తలపై అనుష్క శర్మ మేనేజర్ స్పందించారు. మీడియాలో వారిద్దరి పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలను ఖండించారు. అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

కోహ్లి సెలవులు కూడా ఈ వార్తలకు కారణం
శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లకు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో కూడా ఈవార్తలు రావడానికి ఓ కారణం. అనుష్కతో పెళ్లి కోసమే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అనుష్క మేనేజర్ ఖండించడంతో ప్రచారానికి తెరపడింది.

పెళ్లి నిజమే, ఎప్పుడనేదే క్లారిటీ లేదు
అనుష్క, విరాట్ కోహ్లి పెళ్లి చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది? అనే విషయంలోనే క్లారిటీ లేదు. అభిమానులు మాత్రం ఈ ఇద్దరూ ఏకమైతే చూడాలని ఆశగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











