ప్రియుడి వ్యహారంపై....అనుష్క స్ట్రాంగ్ రిప్లై
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఏమాత్రం సమయం దొరికినా ఇద్దరూ కలిసి ఏకాంతంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ విషయం బహిరంగ రహస్యమే.
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ అనేక సందర్బాల్లో కలిసి తిరిగుతూ దొరికి పోయారు కూడా. గత క్రికెట్ టోర్నమెంట్లలో కొన్ని మ్యాచుల్లో విరాట్ కోహ్లి పెర్ఫార్మెన్స్ పరంగా ఫెయిల్ అవ్వడానికి అనుష్క శర్మతో తిరగడమే కారణమనే విమర్శలుకూడా అప్పట్లో వచ్చాయి. బిసిసిఐ కూడా ఈ వ్యవహారంపై అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసింది.

బిసిసిఐ చేసిన విమర్శలపై ఇంతకాలం మౌనంగా ఉన్న అనుష్క శర్మ ఇప్పుడు నోరు విప్పింది. తను నటిస్తున్న ఎన్ హెచ్ 10 సినిమా విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ...‘విరాట్ కోహ్లీ గతంలో సరిగా పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడానికి నేనే కారణం అనడం హాస్యాస్పతం. ఫీల్డ్‌లో విరాట్ కోహ్లి పెర్ఫార్మెన్స్‌కు నేను కారణం ఎలా అవుతాను? వాళ్లు క్రికెటే ఆశ-శ్వాసగా జీవిస్తారు. వాళ్లని చిన్న పిల్లల్లా చూడొద్దు..పెద్ద వాళ్లలా ట్రీట్ చేయండి' అంటూ వ్యాఖ్యానించింది.
అదే సమయంలో ‘విరాట్ కోహ్లి ప్రభావం నా ప్రొఫెషనల్ పెర్పార్మెన్స్‌పై ఏమాత్రం ఉండదు. అదేవిధంగా నా ప్రభావం కూడా అతనిపై ఉండదు. విరాట్ సామర్థ్యంపై ఎందుకంత అనుమానం? అతను సాధించిన వాటికి క్రిడిట్ అతనికే ఇవ్వండి' అంటూ అనుష్క శర్మ చెప్పుకొచ్చింది. ఈ విధంగా బిసిసిఐకి అనుష్క శర్మ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఇక అనుష్క శర్మ నటిస్తున్న ఎన్ఎహెచ్ 10 చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











