‘సంజు’ బయోపిక్: అనుష్క లుక్ విడుదల చేసిన దర్శకుడు
బాలీవుడ్ వివాదాస్పద నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'సంజు'లో అనుష్క శర్మ కీలకమైన పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మంగళవారం అనుష్క శర్మకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో అనుష్క ఏ పాత్రలో కనిపించబోతోంది? అనేది మాత్రం వెల్లడించలేదు. బుధవారం జరిగే ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో అనుష్క పాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ముంబైలో మే 30న 'సంజు' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ ఈ ట్రైలర్ కొందరు బాలీవుడ్ సినీ ప్రముఖుల కోసం ప్రదర్శించారు. అది చూసిన అనంతరం రిషి కపూర్ స్పందిస్తూ ఇందులో సంజయ్ దత్ పాత్ర పోషిస్తున్న తన కుమారుడు రణబీర్ కపూర్ పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
నిర్మాత వినోద్ చోప్రా, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ట్రైలర్ చూపించిన వెంటనే నేను ఎంత ఎమోషనల్ అయ్యానో మీకు తెలియదు. రణబీర్ కపూర్ జైలు నుండి బయటకు వచ్చే సీన్ అద్భుతంగా ఉంది. ఆ సీన్ చూసినపుడు అచ్చం సంజయ్‌ను చూసిన ఫీలింగ్ కలిగిందని రిషి కపూర్ తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా సోనమ్ కపూర్, దియా మీర్జా, కరిష్మా తన్నా, మనీషా కొయిరాలా, జిమ్ వర్బ్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 29న ఈ బయోపిక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











