అనుష్క ఎఫైర్లు: ఇప్పటికి ఏడుగురితో..! (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది. ముఖ్యంగా ఎఫైర్ల విషయంలో అమ్మడు యమా ఫాస్ట్‌గా ఉంది. ఇప్పటి వరకు ఆమెకు పలువురు సెలబ్రిటీలతో ఎఫైర్ల ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో బాలీవుడ్ యంగ్ హీరోలతో పాటు విరాట్ కోహ్లి లాంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.
లైఫ్‌ను ఎంజాయ్ చేసే తత్వం, పబ్లిసిటీ, పాపులారిటీ పెంచుకోవాలనే తాపత్రయంతో సెలబ్రిటీలు ఎఫైర్ల దారి పడుతున్నారని స్పష్టమవుతోంది. ఎప్పుడూ ఎఫైర్లతో వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉండే భామలకే ఫాలోయింగ్, పాపులారిటీ, పబ్లిసిటీగా బాగా పెరుగుతోంది. దీంతో పాటు వారికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
ఇప్పటి వరకు అనుష్క శర్మతో ఎఫైర్ ఉన్న వారి పేర్లలో రణవీర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమె విరాట్ కోహ్లితో చక్కర్లు కొట్టడం కూడా చర్చనీయాంశం అయింది. మరో ఐదుగురు స్టార్స్ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

జోహెబ్ యూసఫ్
సినిమాల్లోకి రాక ముందు అనుష్క శర్మ మోడిలింగ్ చేసేది. అప్పుడు జోహెబ్ యూసఫ్ అనే తన తోటి మేల్ మోడల్‌తో సన్నిహితంగా ఉండేది. ఇద్దరూ రెండేళ్ల పాటు ఎఫైర్ నడిపారు. అయితే అనుష్క సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

రణవీర్ సింగ్
బ్యాండ్ బాజా భారత్ చిత్రం ద్వారా పరిచయమైన అనుష్క శర్మ, రణవీర్ సింగ్ చాలా క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రణబీర్ కపూర్
కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఓ విందులో రణబీర్, అనుష్క మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ కొంతకాలం సన్నిహితంగా గడిపారు. దీంతో ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారనే వార్తలు వెలువడ్డాయి.

షాహిద్, అనుష్క
ఇమ్రాన్ ఖాన్ నటించిన ‘మేరే బ్రదర్ కి దుల్హన్' సక్సెస్ పార్టీలో షాహిద్, అనుష్క ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంతే ఇప్పటికీ తేలలేదు.

సురేష్ రైనా
ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాతో అనుష్క ప్రేమాయణం సాగించిన అప్పట్లో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అర్జున్ కపూర్
బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్, అనుష్క శర్మ కొన్ని ప్రాంతాల్లో కలిసి పర్యటించడం, సన్నిహితంగా మెలగడంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి-అనుష్క శర్మ మధ్య ఎఫైర్ ఈ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఇద్దరూ కలిసి న్యూజిలాండ్‌లో కెమెరాకు చిక్కారు. అతని కోసం అనుష్క క్రికెట్ మ్యాచ్‌లు చూసేందుకు విదేశాలకు వెళ్లడం, ఆమె కోసం షూటింగ్ జరిగే ప్రాంతాలకు విరాట్ వెళ్లడం, ఇద్దరూ కలిసి విమాన ప్రయాణం చేయడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











