»   » అనుష్క మూవీ షూటింగులో విషాదం, ఒకరి మృతి

అనుష్క మూవీ షూటింగులో విషాదం, ఒకరి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పరి' సినిమా షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోల్‌బెరియాలో ఔట్‌డోర్ షూటింగ్ జరుగుతుండగా కరెంటు వైరు తగలడంతో బాలీవుడ్ టెక్నిషియన్ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన షా ఆలమ్(28) అని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పంపించామని, నివేదిక వచ్చిన తర్వాత ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయమై పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Anushka Sharma's Pari shooting gets stalled after a technician DIES of electric shock

షూటింగ్‌లో ఓ వెదురు పొద చుట్టూ నటులు, వస్తువులు కనిపించేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. అక్కడి లైవ్ వైర్లలోని ఓ వైరును అతడు పట్టుకుని ఉండవచ్చు... అని పోలీసు అధికారి పేర్కొన్నారు. ఈ దుర్ఘటనతో 'పరి' షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

English summary
Anushka Sharma's Pari shooting gets stalled after a technician DIES of electric shock.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu