షాకిస్తున్న అనుష్క ప్రెగ్నెన్సీ వార్త.. ప్లీజ్ వేదిలేయండి అంటూ!
ఈ మధ్యకాలంలో సెలెబ్రెటీలకు సంబందించిన పలు విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ డేటింగ్, ప్రెగ్నెన్సీ వార్తలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా గాసిప్ రాయుళ్లు చెలరేగిపోతున్నారు. ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్, ఈ హీరోయిన్ డేటింగ్, ఇంకో హీరోయిన్ పెళ్లి అంటూ వార్తలు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భామ అనుష్క శర్మ గర్భవతి అనే వార్త వెలుగు లోకి వచ్చింది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రేమ వివాహం చేసుకున్న అనుష్క శర్మ.. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూనే వస్తోంది. కానీ ఇటీవల ఆమె నటించిన 'జీరో' సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ సినిమాలో షారూక్ ఖాన్ జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆమె మరో సినిమాకు కూడా సంతకం చేయలేదు. దీంతో అనుష్క శర్మ గర్భం దాల్చింది.. అందుకే గత కొంతకాలంగా సినిమాలు ఒప్పుకోవడం లేదు అని వార్తలు పుట్టుకొచ్చాయి. రోజు రోజుకూ ఈ వార్తల తాకిడి మరింత ఎక్కువ కావడంతో చివరకు అనుష్క శర్మ స్పందించింది.

హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు.. కానీ ఇలాంటి వార్తలు పుట్టించి ఆసక్తి రేకెత్తించడం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అక్కడేమీ ఉండదు కానీ ప్రెగ్నెంట్ అని మీరే కన్ఫర్మ్ చేస్తారు. ఇలాంటి వార్తలకు వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి తీసుకొస్తారు. దయచేసి ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం ఆపండి. మమ్మల్ని ఇలా వదిలేయండి అంటూ కాస్త సీరియస్ అయింది అనుష్క శర్మ.


Click it and Unblock the Notifications











