తట్టుకోలేక అనుష్క విలవిల, ట్విట్టర్ ద్వారా ప్రకటన
హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం సినిమా షూటింగులో భాగంగా రాజాస్థాన్‌లోని జోధ్ పూర్లో ఉంది. ఇక్కడ ఆమె తన తాజా సినిమా 'ఎన్‌హెచ్ 10' చిత్రంలో నటిస్తోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం కావడం, ఓ వైపు ఎండలు మండి పోతున్నాయి. ఇదే సమయంలో ఇసుక తుఫాను రావడంతో షూటింగుకు అంతరాయం ఏర్పడింది.
ఇసుక తుఫాను రావడంతో చాలా భయ పడ్డామని అనుష్క తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. యూనిట్ మొత్తం కూడా ఈ ఇసుక తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మొత్తానికి అంతా సురక్షితంగా బయట పడ్డామని అనుష్క శర్మ చెప్పుకొచ్చారు. ఎన్.హెచ్ 10 చిత్రానికి నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు అనుష్క శర్మ 'బాంబే వెల్వెట్' చిత్రంలో కూడా నటిస్తోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవలే శ్రీలంకలో షూటింగ్ పూర్తయింది. రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్, రవీనా టండన్, కెకె మీనన్, సిద్ధార్థ బసు తదితరులు ఈచిత్రంలో నటిస్తున్నారు. ఈ సంవత్సరం క్రిస్‌మస్ నాటికి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











