twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరల్డ్ నెం.1 డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మూవీలో అనుష్క?

    By Bojja Kumar
    |

    ముంబై: టైటానిక్, అవతార్ లాంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రాలకు దర్శకత్వం వహించిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ నటించబోతోందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆస్కార్ అవార్డు పొందిన 'లింకన్' చిత్ర సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ రియలన్స్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ అంబానీ ఆహ్వానం మేరకు భారత్ వచ్చిన స్పీల్‌‌బర్గ్ తన తర్వాతి సినిమాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

    దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యపై స్పీల్‌వర్గ్ సినిమా తీయబోతున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో స్పీల్‌బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే స్క్రిప్టు ఫైనలైజ్ అయిందని, కాస్టింగ్, లొకేషన్స్, టెక్సీషియన్స్ ఫైనలైజ్ కావాల్సి ఉందని స్పీల్ బర్గ్ చెప్పుకొచ్చారు.

    ఈ సినిమాలో అనుష్కను ఫిమేల్ లీడ్ హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనే నిజమైతే అనుష్క హాలీవుడ్ స్టార్స్ డేంజల్ వాషింగ్టన్, రిచర్డ్ గేర్, బ్రాడ్లీ కూపర్ లాంటి వాళ్లతో కలిసి పని చేయనుందని తెలుస్తోంది. ఏది ఏమైనా స్పీల్‌బర్గ్ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇస్తే తప్ప ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.

    ప్రస్తుతం అనుష్క శర్మ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్‌తో కలిసి పీకె చిత్రంతో పాటు, రణ‌బీర్ కపూర్‌తో కలిసి అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బెషరామ్'అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

    English summary
    The arrival of Hollywood’s prolific film maker, Steven Spielberg, on the Indian shores has brought a golden opportunity for one of our desi actresses to star in his next film project based on the Kashmir issue. And if the reports are to be believed, then it is none other than Anushka Sharma on whom lady luck seems to be smiling.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X