హాట్ హీరోయిన్ అనుష్క కూడా ఇపుడు మిలియనీర్
హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మకు సోషల్ నెట్వర్కింగులో ఫాలోయింగ్ బాగా పెరిగి పోతోంది. ట్విట్టర్లో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య తాజాగా 3 మిలియన్ (30 లక్షలు) దాటింది. ఈ ఫీట్ సాధించడంతో అనుష్క సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతోంది.
ఈ సందర్భంగా అనుష్క శర్మ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ....'నా ఫాలోవర్ల సంఖ్య 3 మిలియన్లు దాటింది. నాకు సపోర్టుగా ఉన్న 3 మిలియన్ల ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. లవ్ యూ ఆల్' అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అనుష్క వర్మ వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

రబ్ దే బనాదీ జోడీ, బ్యాండ్ బాజా బారత్, జబ్ తక్ హై జాన్ లాంటి హిట్ చిత్రాల్లో నటించిన అనుష్క......మరికొన్ని ప్లాపు చిత్రాల్లోనూ నటించింది. ఆమె సినిమా కెరీర్ పడుతూ లేస్తూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం బాంబే వెల్వెట్, పికె, దిల్ ధడక్నే దో తదితర చిత్రాల్లో అనుష్క నటిస్తోంది.
సినిమాల సంగతి పక్కన పెడితే...అనుష్క ఇటీవల కాలంలో ఇతర కారణాలతో వార్తల్లో వ్యక్తిగా మారుతోంది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లితో అనుష్క ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుష్క షూటింగులు జరిగే ప్రాంతాలకు విరాట్ రహస్యంగా వెళ్లడం.....విరాట్ మ్యాచ్‌లు చూసే నెపంతో విదేశాల్లో ఇద్దరూ ఒకే హోటళ్లలో బస చేయడం లాంటివి ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.


Click it and Unblock the Notifications











